hyderabadupdates.com movies కేంద్రం బడ్జెట్… పన్నుల వాటా సంగతేంటి?

కేంద్రం బడ్జెట్… పన్నుల వాటా సంగతేంటి?

రాష్ట్రాల బాధ్య‌త విష‌యంలో కేంద్రం పూర్తిగా త‌ప్పుకొందా? ఇక నుంచి రాష్ట్రాల ఆదాయం పూర్తిగా ఆయా రాష్ట్రాలే సంపాయించుకోవాలా?  అంటే.. తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్ ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రాంట్ల రూపంలో రాష్ట్రాల‌కు తిరిగి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేని విధంగా కొన్నింటికి సొమ్ములు ఇస్తోంది. కానీ.. ఈ ద‌ఫా ఆ బాధ్య‌త నుంచి త‌ప్పుకొంది.

అన్ని గ్రాంట్ల‌ను ఈ ఏడాది నిలిపివేశారు. దీంతో రాష్ట్రాలే త‌మ అవ‌స‌రాల‌కు నిధులు స‌మ‌కూర్చుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఫ‌లితంగా ఆదాయ మార్గాల‌ను అన్వేషించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇది అంతిమంగా.. ప్ర‌జ‌ల‌పై భారం వేసేలా ఉంటుందా?  లేక.. ఇత‌ర మార్గాల‌ను రాష్ట్రాలు అన్వేషించుకుంటాయా? అనేది చూడాలి. వాస్త‌వానికి 2014లో మోడీ స‌ర్కారు ఏర్ప‌డ‌క ముందు రాష్ట్రాల‌కు భారీ ఎత్తున గ్రాంట్లు ఇచ్చేందుకు బ‌డ్జెట్‌లో నిధులు చూపించారు.

కానీ, మోడీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. నెమ్మ‌ది నెమ్మ‌దిగా గ్రాంట్ల‌ను త‌గ్గిస్తూ.. వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు పూర్తిగా ఎత్తేశారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాలైన మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం, గ్రామీణ ఉపాధి ప‌థ‌కం, జ‌ల్ జీవ‌న్ మిష‌న్ వంటి కీల‌క ప‌థ‌కాల‌కు కూడా.. గ్రాంట్ల‌ను నిలిపి వేశారు. త‌ద్వారా.. రాష్ట్రాలే సంపాయించుకుంటాయ‌ని.. ఆ సామ‌ర్థ్యం రాష్ట్రాల‌కు ఉంద‌ని బ‌డ్జెట్‌లో తేల్చేశారు. ఇది రాష్ట్రాల‌కు భారంగా మార‌నుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

మార‌ని వాటా..

ఇక‌,.. రాష్ట్రాల‌కు ఇచ్చే ప‌న్నుల్లో వాటా మాత్రం ఎక్క‌డా మార‌లేదు. రాష్ట్రాల నుంచి వ‌సూలు చేస్తున్న జీఎస్టీలో రాష్ట్ర వాటా కింద‌.. 41 శాతం ఇవ్వాల‌ని నీతి ఆయోగం, ఆర్థిక సంఘాలు సూచించాయి. వీటినే కొన‌సాగిస్తున్నారు. కానీ, రాష్ట్రాలు మాత్రం దీనిని 50 శాతానికి పెంచాల‌ని కోరుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ఈ విష‌యంలో చెబుతున్న‌ది.. `మీకు గ్రాంట్ల రూపంలో నిధులు ఇస్తున్నాం“ అనే. కానీ, ఇప్పుడు ఈ గ్రాంట్ల‌ను ఎత్తేసిన ద‌రిమిలా.. ప‌న్నుల్లో వాటా పెంచ‌క‌పోతే రాష్ట్రాలు ఊరుకుంటాయా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. రాష్ట్రాల‌కు ఇబ్బందేన‌న్నది ఆర్థిక నిపుణుల అంచ‌నా.

Related Post

Meher Ramesh Urges Marathi Audience in Hyderabad to Support ‘Magic’Meher Ramesh Urges Marathi Audience in Hyderabad to Support ‘Magic’

Celebrated filmmaker Meher Ramesh has called upon the Marathi-speaking audience in Hyderabad to watch and support the upcoming Marathi psychological thriller Magic, which is gearing up for a theatrical release