ఏ రాష్ట్రంలో అయినా… ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ తరహా వాతావరణం కనిపిస్తోంది. అయితే.. దీనికి భిన్నంగా తెలంగాణలో మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన కేసీఆర్‌ను సభలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన కుర్చీవద్దకు వెళ్లి చేతిలో చేయి వేసి పలకరించారు. గతంలో ఎప్పుడూ.. ఇలాంటి మర్యాదలు.. పాటించిన దాఖలాలు లేవు. ప్రతిపక్ష నేతలే అధికార పక్ష నాయకులకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, దీనికి విరుద్ధంగా.. రేవంత్ రెడ్డి పెద్దమనసు చేసుకుని కేసీఆర్‌ను గౌరవించారు. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రెండుసార్లు తెలంగాణ పండుగగా పేర్కొనే మేడారం జాతర జరిగింది. అయితే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్లి ఆయనకు ఆహ్వాన పత్రికను ఇచ్చింది లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. కూడా ఆయన కూడా ప్రధాన ప్రతిపక్షాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ దఫా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు స్వయంగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కువెళ్లి మేడారం జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించారు. రావాలని పిలిచారు.
అంతేకాదు.. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. ఇలా కేసీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రజల్లో సహజంగా సింపతీ ఉంటుంది. ప్రధానంగా కేసీఆర్‌ను గౌరవించడం: పార్టీలకు అతీతంగా.. కేసీఆర్‌ను గౌరవించాలని కోరుకునే సమాజం ఉంది.
ఆయనను అవమానిస్తే.. దానిని ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంటుంది. అందుకే.. రాజకీయాలు ఎలా ఉన్నా.. వ్యక్తిగా, తెలంగాణకు పెద్దగా కేసీఆర్‌ను గౌరవించడం ద్వారా ప్రజల్లో ఉన్న సెంటిమెంటు వ్యతిరేకత కాకుండా చూసుకునే వ్యూహంతోనే రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
When culture takes politicians beyond politics!Telangana ministers Konda Surekha and Seethakka invited BRS chief #KCR to the Medaram Sammakka-Saralamma Jatara. pic.twitter.com/FXdAM7taYu— Gulte (@GulteOfficial) January 8, 2026