hyderabadupdates.com movies కేసీఆర్ చెబితేనే… ఫోన్ ట్యాప్ విచారణలో కీలకాంశం వెలుగులోకి!

కేసీఆర్ చెబితేనే… ఫోన్ ట్యాప్ విచారణలో కీలకాంశం వెలుగులోకి!

ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణ సిట్ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురిని విచారించి.. వారి వాంగ్మూలాల్ని రికార్డు చేస్తున్న అధికారులు.. తాజాగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఓఎస్డీగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డిని తాజాగా విచారించి..వాంగ్మూలాన్నిరికార్డు చేశారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ సాగింది.

ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రావు 2020 జూన్ 30న ఉద్యోగ విరమణ పొందగా..అదే రోజు ఆయన్ను మూడేళ్లు కంటిన్యూ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా మరోరెండేళ్లు ఆయన్ను సర్వీసులో కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటాన్ని ప్రశ్నిస్తూ.. ‘రెండోసారి ప్రభాకర్ రావునుకంటిన్యూ చేయాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగానికి సూచన చేయాల్సిన అవసరమేంటి?’ అన్న కోణంలో సిట్ విచారణ చేయగా..

అప్పటి సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. ప్రభాకర్ రావు రిటైర్మెంట్ కావటానికి వారం ముందే తనకు చెప్పటంతో ఆయన్ను అపాయింట్ చేసినట్లుగా పేర్కొన్నారు.సీఎంగా ఉన్న కేసీఆర్ తనకు ఆదేశాలు జారీ చేయటంతో ఆయన్ను కంటిన్యూ చేయాలని జీఏడీ అధికారులకు సూచన చేశానని.. రాజశేఖర్ రెడ్డి సిట్ కు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలిసింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావును గతంలో విచారించిన సమయంలోనూ కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. తాజాగా రాజశేఖర్ రెడ్డి విచారణలోనూ కేసీఆర్ పేరు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Post

బీహార్ దంగ‌ల్‌: ఎన్డీయేకు అనూహ్య విజ‌యం!బీహార్ దంగ‌ల్‌: ఎన్డీయేకు అనూహ్య విజ‌యం!

దేశంలో అత్యంత ఉత్కంఠ‌కు దారితీసిన కీల‌క‌మైన ఎన్నిక బీహార్ అసెంబ్లీ పోలింగ్. 243 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో రెండు ద‌శ‌ల్లో ఎన్నికల పోలింగ్ జ‌రిగింది. నిజానికి ఈ ఎన్నిక‌.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకంటే కూడా.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హాగ‌ఠ్

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, హైకోర్టు ఏం చెప్పింది?పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, హైకోర్టు ఏం చెప్పింది?

దాదాపు 10 మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌న‌ర్‌ షిప్(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. వైసీపీ హయాంలో మొత్తం 17 కాలేజీలు తీసుకురాగా.. వీటిలో ఐదు