మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరులో చదువుకున్న కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసని రేవంత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
తాను ఉమ్మడి ఏపీలోని గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి నొప్పెందుకు అని కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్, పుణె, అమెరికాలో చదివానని..రేవంత్ మాదిరి చదువు, సంధ్య లేనివాడిని కాదని చురకలంటించారు.
రేవంత్ రెడ్డిని ఆయన తల్లిదండ్రులు సరైన మార్గంలో నడపలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇంగ్లిషు మాట్లాడుతున్నా రేవంత్ ఓర్వలేకపోతున్నారని, తనకు హిందీ, ఉర్దూ కూడా వచ్చని, తనను చూసి ఏడ్వడం మానేసి ఆయన కూడా ఇంగ్లిషు నేర్చుకోవచ్చని సెటైర్లు వేశారు.
ఉమ్మడి ఏపీలో తాను చదివితే తప్పుబట్టిన రేవంత్…ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత భీమవరం వెళ్లి అల్లుడిని తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. అందుకే, ఇక నుంచి రేవంత్ పేరు చిట్టినాయుడు కాదని… భీమవరం బుల్లోడని సెటైర్లు వేశారు.
తన తండ్రి తెలంగాణ తెచ్చిన మగోడు, మొనగాడు అని.. కాబట్టి ఆయన పేరు తాను చెప్పుకుంటానని అన్నారు. అదే మాదిరిగా రేవంత్ కూడా మంచి పనులు చేస్తే ఆయన మనవడు ఆయన పేరు చెప్పుకుంటాడని హితవు పలికారు. బ్యాగులు మోయడం, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు పంపడం తమ వల్ల కాదని, మొనగాళ్ల మాదిరి తెలంగాణ పౌరుషంతో తాము బ్రతుకుతామని అన్నారు.
రేవంత్ రోజూ అరుస్తున్నడని, ఆయన ఎవరినైనా కరుస్తడేమో అని భయంగా ఉందని రేవంత్ భార్య గీతమ్మకు ఆయన్ని కట్టేయమని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఏనుగు పోతుంటే కుక్కలు, నక్కలు మొరుగుతుంటాయని, పట్టించుకోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.
“మా అయ్య గొప్పోడు, తెలంగాణ తెచ్చిన మనగాడు.మా అయ్య పేరు నేను కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు.”– #KTR pic.twitter.com/IhwXzX8th8— Gulte (@GulteOfficial) December 26, 2025