hyderabadupdates.com Gallery ‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

‘కొత్త మ‌లుపు’ మూవీ  ఫ‌స్ట్ లుక్ లాంచ్ post thumbnail image

హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఆకాష్‌, భైర‌వి అర్ద్యా క‌లిసి న‌టించిన చిత్రం కొత్త మ‌లుపు. ఇందుకు సంబంధించి హైద‌రాబాద్ లో బుధ‌వారం మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వ‌హించారు. తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతోంది ఈ చిత్రం . అంతే కాకుండా ఈ మూవీలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్ర‌లు పోషించారు.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడారు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం అని చెప్పారు. ఆకాష్–భైరవి జోడీ చాలా చక్కగా కుదిరిందని అన్నారు. వీరు బావ–మరదలుగా నటిస్తున్నార‌ని తెలిపారు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశామ‌ని,. త్వరలోనే సినిమా విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంద‌న్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తామ‌న్నారు.
గ్రామీణ నేపథ్యంతో ప్రేమ–సస్పెన్స్–కామెడీ మేళవింపుతో రూపొందుతున్న కొత్త మలుపు ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
The post ‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌

    కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్‌ బంధం లేకపోతే జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

అఖండ 2 స్పీడు పెంచాల్సిందే!అఖండ 2 స్పీడు పెంచాల్సిందే!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న “అఖండ 2” సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. “అఖండ” ఇచ్చిన ఘనవిజయం తర్వాత ఈ జోడీ మళ్లీ