hyderabadupdates.com movies కోలీవుడ్ సంచలన ప్రతిపాదనలు… జరిగే పనేనా

కోలీవుడ్ సంచలన ప్రతిపాదనలు… జరిగే పనేనా

తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పలు సంచలనాత్మక ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఇండస్ట్రీ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. అవి నిజంగా అమలులోకి వస్తే మాత్రం ఇతర భాషల్లోనూ ప్రకంపనలు పుట్టడం ఖాయం. ముందు అవేంటో చూద్దాం. ఇకపై నటీనటులు, సాంకేతిక నిపుణులు ఫుల్ రెమ్యునరేషన్ ని టోకుగా తీసుకోవడానికి లేదు. లాభ నష్టాలను నిర్మాతతో కలిసి ఒప్పందం ప్రకారం పంచుకోవాల్సి ఉంటుంది. స్టార్ హీరోల ఓటిటి విండో ఇకపై 8 వారాలు. టయర్ 2 సినిమాలకు 6 వారాలు, చిన్న చిత్రాలకు 4 వారాలు ఉండాలి. ఫలితంతో సంబంధం లేకుండా దీన్ని పాటించాలి.

టికెట్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా కోలీవుడ్ కో ప్లాట్ ఫార్మ్ ఉండాలి. అందులో రిజర్వేషన్ చార్జీలను నామమాత్రంగా పెట్టి ప్రేక్షకులను ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలి. వినడానికి అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ప్రాక్టికల్ గా అమలు చేయడం కత్తి మీద సామే. ఎందుకంటే రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి హీరోల పారితోషికాలు రెండు వందల కోట్ల పైమాటే ఉన్నాయి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ పద్దతిలో వెళ్తే అందులో సగమైనా వస్తాయనే గ్యారెంటీ లేదు. ఇప్పుడు పంపకాల పద్ధతి కాబట్టి నిర్మాత ఒరిజినల్ ఫిగర్స్ చూపించి షేర్ ఇస్తా అంటాడు. దీనికి ఎంత మంది సుముఖంగా ఉంటారనేది అనుమానమే.

ఇక ఓటిటి విషయానికి వస్తే ఒకవేళ ఇలా స్ట్రిక్ట్ గా కండీషన్లు పెడితే డిజిటల్ కంపెనీలు ప్రొడ్యూసర్లకు ఇచ్చే మొత్తంలో భారీ కోత పెడతాయి. ఇది సంకటంగా మారుతుంది. దీని ప్రభావం నేరుగా బడ్జెట్ ల మీద పడుతుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ కాగానే నెల రోజుల విండో పద్దతి మీద ఓటిటిలు చాలా పెద్ద మొత్తాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎనిమిది వారాలు అంటే సగమే ఇస్తామని మెలిక పెడతాయి. ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదన దశలోనే ఉన్నాయి కాబట్టి అమలు చేసే దాకా వేచి చూడాలి. నిజంగా జరిగితే మాత్రం సెన్సేషన్ అవుతుంది. మిగిలిన ఇండస్ట్రీలు ఫాలో అయ్యే ఛాన్స్ లేకపోలేదు.

Related Post