hyderabadupdates.com movies క్రిస్మస్ సినిమాల్లో రెండు సర్ప్రైజ్‌లు

క్రిస్మస్ సినిమాల్లో రెండు సర్ప్రైజ్‌లు

ఈ ఏడాది చివరి వీకెండ్లో ఏకంగా అరడజను సినిమాలు రిలీజయ్యాయి. క్రిస్మస్ వీకెండ్ కావడంతో పోటీ ఉన్నా పర్వాలేదని ఒకేసారి అన్ని సినిమాలనూ రిలీజ్ చేసేశారు. ఈ చిత్రాలన్నీ చిన్న, మిడ్ రేంజివే. ఐతే ఈ అరడజను సినిమాల్లో దేనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. డబ్బింగ్ సినిమా అయిన ‘వృషభ’ ఔట్ రైట్ డిజాస్టర్ అని ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే తేలిపోయింది.

మిగతా అయిదు తెలుగు చిత్రాల్లో ‘శంబాల’ బెటర్ టాక్ తెచ్చుకుని ఆ టాక్‌కు తగ్గట్లే వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది. ‘ఛాంపియన్’‌కు బిలో యావరేజ్ టాక్ రాగా.. వసూళ్లు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. రిలీజ్ ముంగిట అస్సలు సౌండ్ చేయని ‘పతంగ్’ అనే చిన్న సినిమాకు మంచి టాకే వచ్చింది. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. మిగతా రెండు చిత్రాల బాక్సాఫీస్ రన్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

శివాజీ ముఖ్య పాత్ర పోషించిన ‘దండోరా’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. వాస్తవ ఘటనల ఆధారంగా కులం సమస్య చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాగా ‘దండోరా’ను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఐతే చూసిన వాళ్లంతా మంచి సినిమా అంటున్నా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇలాంటి సినిమా వేరే భాషలో వస్తే మన వాళ్లు ఆహా ఓహా అంటారని, తెలుగులో వస్తే మాత్రం ఆదరించడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇంత పోటీ మధ్య రావడం ఈ సినిమాకు చేటు చేసిందని అంటున్నారు. సీరియస్ సినిమా కావడం మైనస్ అయిందనే వాదనా వినిపిస్తోంది. డీసెంట్ టాక్, రివ్యూలు తెచ్చుకున్న సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాడ్ టాక్, నెగెటివ్ రివ్యూలతో మొదలైన ‘ఈషా’ సినిమాకు మాత్రం అంచనాలకు మించే వసూళ్లు వస్తున్నాయి.

రిలీజ్ డే నుంచి ప్రతి రోజూ కొన్ని షోల వరకు ఈ సినిమాకు ఫుల్స్ పడుతున్నాయి. చాలా షోలకు మంచి ఆక్యుపెన్సీలే కనిపిస్తున్నాయి. ఆదివారం కూడా పరిస్థితి మెరుగ్గానే ఉంది. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కావడంతో వీకెండ్ లోపలే సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోవడం విశేషం. ఈ రెండు చిత్రాల ఫలితాలు చూసి.. ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఎలా ఆదరిస్తారో అర్థం కాదని ఫిలిం మేకర్స్ తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.

Related Post

క్రేజీ కాంబో… చిరుతో కార్తి?క్రేజీ కాంబో… చిరుతో కార్తి?

ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో కూడా వేరే స్టార్లు క్యామియోలు, ప్ర‌త్యేక పాత్ర‌లు చేయ‌డం మామూలైపోయింది. వీలైన‌పుడు మ‌ల్టీస్టార‌ర్లు కూడా చేస్తున్నారు స్టార్లు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాక ప‌లు చిత్రాల్లో వేరే స్టార్లు ప్ర‌త్యేక పాత్ర‌లు పోషించారు.

మెగా మాస్ – 300 కోట్లు… 3 మిలియన్ల డాలర్లుమెగా మాస్ – 300 కోట్లు… 3 మిలియన్ల డాలర్లు

అంచనాలకు మించి ఆడేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు కొన్ని ప్యాన్ ఇండియా సినిమాలకు సైతం సాధ్యం కాని రికార్డులను చాలా అలవోకగా దాటేస్తున్నాడు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవుతారని ఊహించిన వాళ్ళు తక్కువ. ఎనిమిదో రోజే