hyderabadupdates.com movies క్రేజీ కాంబో 45కి సౌండ్ లేదేంటి

క్రేజీ కాంబో 45కి సౌండ్ లేదేంటి

శివరాజ్ కుమార్ కన్నడలో సీనియర్ స్టార్ హీరో అయినప్పటికీ మనకు ఎక్కువ కనెక్ట్ కావడం మొదలయ్యింది జైలర్ తర్వాతే. రామ్ చరణ్ పెద్దిలో ఎప్పుడైతే గౌర్ నాయుడుగా ఒక ముఖ్యమైన పాత్ర దక్కించుకున్నారో అప్పటి నుంచి మరింత దగ్గరైన ఫీలింగ్ అభిమానుల్లో కలిగింది.

దీనికన్నా ముందు గౌతమీపుత్ర శాతకర్ణిలో బుర్రకథ పాటకు డాన్స్ చేసిన శివన్నకు అందులో బాలకృష్ణతో పెద్దగా కాంబో సీన్స్ లేకపోవడంతో ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. గుమ్మడి నరసయ్యలో టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ లెజెండరీ యాక్టర్ కొత్త మూవీ 45 గత వారం డిసెంబర్ 25 కన్నడలో విడుదలయ్యింది. అసలు విశేషం ఇది కాదు.

ఇందులో ఉపేంద్ర కూడా ఉన్నాడు. మల్టీస్టారర్ గా రూపొందిన 45కి మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య తొలిసారి దర్శకత్వం వహించారు. చాలా క్రిటికల్ పాయింట్ తో 45 రూపొందింది. మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు, ప్రకృతి, నైతిక విలువలు అంటూ చాలా అంశాలు ఇందులో తీసుకున్నారు.

చాలా టఫ్ అనిపించే స్క్రీన్ ప్లే ఎంచుకున్న అర్జున్ జన్య కర్ణాటకలో విమర్శల ప్రశంసలు అందుకున్నారు. కమర్షియల్ గా వసూళ్లు బాగానే ఉన్నాయి కానీ మరీ బ్లాక్ బస్టర్ అనిపించుకునే స్థాయిలో మేజిక్ చేయలేదు. కాకపోతే మంచి ప్రయత్నం, విభిన్నంగా ఉంది, చూడొచ్చనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

ఇప్పుడీ 45 తెలుగులో రేపు రిలీజవుతోంది. కొత్త సంవత్సర కానుక మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇటీవలే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ కంటెంట్ ఇంకా కామన్ ఆడియన్స్ కి చేరలేదు.

విచిత్రమైన గెటప్పులుతో, అర్థం కాని బ్యాక్ గ్రౌండ్ తో వెరైటీగా రూపొందిన 45లో శివరాజ్ కుమార్ అమ్మాయి వేషం వేయడం గమనార్హం. పోటీలో సైక్ సిద్దార్థ, సుదీప్ మార్క్, వనవీర లాంటి కంటెంట్ మీద ఆధారపడ్డ సినిమాలే ఉండటంతో ఆ అడ్వాంటేజ్ వాడుకునే ఛాన్స్ 45కి ఉంది. కానీ అలా చేసే దిశగా పెద్దగా సౌండ్ వినిపించడం లేదు. టాక్ ఎలా వస్తుందో చూడాలి.

Related Post

Diés Iraé Online Release: When and where to watch Pranav Mohanlal’s horror flick on OTTDiés Iraé Online Release: When and where to watch Pranav Mohanlal’s horror flick on OTT

The film follows Pranav Mohanlal’s character Rohan, a wealthy Indian-American architect living comfortably in a Kerala villa. After hearing about the passing of his former classmate Kani, played by Sushmita