hyderabadupdates.com movies ఖర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా?

ఖర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా?

ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు చిమ్మిన విషం అంతా ఇంతా కాదు. అమరావతిని శ్మశానంతో పోల్చడం మొదలు అమరావతిని అడవిలా మార్చడం వరకు వైసీపీ నేతలు చేయాల్సిందంతా చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు కలకు వైసీపీ నేతలు తూట్లు పొడిచారు. అధికారం పోయినా సరే..ఇప్పటికీ అమరావతిపై విషం చిమ్మడం మాత్రం మానడం లేదు. అసలు ఏపీకి ప్రపంచస్థాయి రాజధాని ఎందుకని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

పార్టీలు, రాజకీయాలు పక్కనబెడితే…ఒక సగటు ఆంధ్రా పౌరుడిగా తమ రాష్ట్ర రాజధాని ప్రపంచ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కోరుకోవాలి కూడా. కానీ, వైసీపీ నేత అంబటి రాంబాబు మాత్రం అలా అనుకోవడం లేదు. అసలు ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ఓ అంతులేని కథ అంటూ అంబటి వెటకారలంగా మాట్లాడారు. రెండో దశ భూసేకరణ చేపట్టేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అంబటి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడిన వైసీపీకి ప్రజలు 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, అయినా సరే అమరావతి రాజధానిపై వైసీపీ బురదజల్లడం మానలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అమరావతి రాజధాని పూర్తయితే వైసీపీకి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని, అందుకే ఇలా పసలేని వ్యాఖ్యలతో అమరావతి ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఓ పక్క రైతులు సంతోషంగా తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటే అంబటి మాత్రం రైతులు ఇబ్బంది పడుతున్నారని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Post

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు కోర్టుకు స‌మ‌ర్పించింది. అయితే.. ఈ నివేదిక‌లో ప‌లు విష‌యాల‌ను విస్మ‌రించార‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అస‌లు దోషుల‌ను

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇవ‌న్నీ ప్ర‌భుత్వ ఉద్యోగాలేన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామ‌న్న ఆయ‌న‌.. మ‌రో 40 వేల ఉద్యోగాల భ‌ర్తీకి