hyderabadupdates.com Gallery ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే

ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే

ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే post thumbnail image

ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ కు జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌. చివ‌ర‌కు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోటీ నెల‌కొంది. కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈ కీల‌క ప‌ద‌విని కైవ‌సం చేసుకోవ‌డం విశేషం. విచిత్రం ఏమిటంటే భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ అనూహ్యంగా బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపింది. రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. గులాబీ పార్టీ ఇచ్చిన స‌పోర్ట్ తో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు బీజేపీకి చెందిన అంకం మౌనిక. వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షోయబ్ ఎన్నిక‌య్యారు.
దీంతో ఆదివారం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ ఈ పదవిని దక్కించు కోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వికి సంబంధించి త‌మ పార్టీకి చెందిన మ‌హిళ‌కు మ‌ద్ద‌తు గ‌నుక ఇస్తే తాము వైస్ చైర్మ‌న్ ప‌ద‌వికి బేష‌ర‌తుగా స‌పోర్ట్ చేస్తామంటూ బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ క‌మ‌లం ప్ర‌తిపాద‌న‌కు గులాబీ ఓకే చెప్పింది.
12 మంది సభ్యులు కలిగిన ఈ మున్సిపల్ కౌన్సిల్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించ లేదు. బీఆర్ఎస్ , బీజేపీ చెరో నాలుగు స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు స్థానాలు, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి మద్దతు, ఒక ఎక్స్-అఫిషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. అయితే బీఆర్ఎస్ తన మద్దతును బీజేపీకి ప్రకటించడంతో, రాజకీయ సమీకరణాలు బీజేపీకి అనుకూలంగా మారాయి.
The post ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చెల‌రేగిన బ్యాట‌ర్లు భార‌త్ భారీ స్కోరుచెల‌రేగిన బ్యాట‌ర్లు భార‌త్ భారీ స్కోరు

చెన్నై : చావో రేవో తేల్చు కోవాల్సిన స‌మ‌యంలో సూర్య కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా సూప‌ర్ 8 కింద జింబాబ్వేతో జ‌రిగిన పోరులో ఆకాశ‌మే హ‌ద్దుగా

నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డిందినా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్బంగా సింగ‌రేణి టెండ‌ర్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న వ‌ల్ల‌నే నైనీ

Rajasthan: రాజస్థాన్‌ లో మరో బస్సు ప్రమాదం ! 18 మంది దుర్మరణం !Rajasthan: రాజస్థాన్‌ లో మరో బస్సు ప్రమాదం ! 18 మంది దుర్మరణం !

Rajasthan : రాజస్థాన్‌లో ఏసీ బస్సు దగ్ధమైన సంఘటన మరవక ముందే ఆదివారం మరో బస్సు ప్రమాదం సంభవించింది. నిలిపి ఉన్న ట్రయిలర్‌ను బస్సు ఢీకొనడంతో 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రాజధాని జైపూర్‌కు (Jaipur)