hyderabadupdates.com Gallery గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఏపీపై వ‌డ్డీల భారం

గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఏపీపై వ‌డ్డీల భారం

గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఏపీపై వ‌డ్డీల భారం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. గ‌త పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం అని ఆవేద‌న చెందారు. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూలు చేస్తున్నాం అన్నారు. 2019-24 మధ్య ఆర్ధిక క్రమశిక్షణ దెబ్బ తీశారని ఆరోపించారు.. జీతాలు కూడా మొదటి తేదీకి ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. ఇప్పుడు జీతాల చెల్లింపులను గాడిలో పెట్టాం అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం. అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న కొన్ని జిల్లాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఆ జిల్లాలు లైమ్ లైట్లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని అన్నారు. సోమ‌వారం స‌చివాల‌యంలో త‌న అధ్య‌క్ష‌త‌న కీల‌క‌మైన కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు.
అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి అవకాశాలు కన్పిస్తున్నాయ‌ని చెప్పారు. ఇప్పటి వరకు కశ్మీర్ లో మాత్రమే కుంకుమ పువ్వు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు సమీపంలో కోకో సిటీ కూడా ఏర్పాటు అవుతుంద‌న్నారు.కాఫీ సాగు పెంచటంతో పాటు అరకు కాఫీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నాం అన్నారు. ఇది మరింతగా పెరగాలని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు నాయుడు. సంజీవని ద్వారా జూలై 2026 నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. 5 లక్షల మంది హాస్టల్ విద్యార్ధుల స్ర్కీనింగ్ చేపట్టాలి. 12వ తరగతి వరకూ ఉన్న 70 లక్షల మంది విద్యార్ధుల హెల్త్ ప్రోఫైల్స్ కూడా తయారు చేయాలని అన్నారు. కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం, పెరుగుదలను నమోదు చేయాలని స్ప‌ష్టం చేశారు. పౌష్టికాహారం అందించటంతో పాటు అవసరమైన సప్లిమెంట్స్ అందించేలా చర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు చంద్రబాబు నాయుడు.
The post గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఏపీపై వ‌డ్డీల భారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆక్ర‌మ‌దారుణల నుంచి పార్కుల‌ను కాపాడండిఆక్ర‌మ‌దారుణల నుంచి పార్కుల‌ను కాపాడండి

హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌దారుల నుండి ప్ర‌భుత్వ పార్కుల‌ను కాపాడాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం బ‌డంగిపేటను స‌ర్కిల్ ఆల్మాస్‌గూడ 57వ డివిజ‌న్ శ్రీ హిల్స్ కాల‌నీ ఫేజ్ 2లో 1983లో 460 ప్లాట్ల‌తో లే ఔట్ వేశారు. ఇందులో

ఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలుఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని

జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో షోరూం య‌జ‌మానులు స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఈ మేర‌కు గురువారం ఆయ‌న స్వ‌యంగా