hyderabadupdates.com movies గాయాన్ని గుర్తు చేస్తావెందుకు హృతిక్

గాయాన్ని గుర్తు చేస్తావెందుకు హృతిక్

మర్చిపోవాల్సిన గాయం లాంటిది వార్ 2 సినిమా. రిలీజ్ ముందు వరకు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అఫ్ బాలీవుడ్ రేంజ్ లో హడావిడి చేసిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా పోయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అంచనాలను కనీసం పావు వంతు అందుకోలేక నిర్మాత ఆదిత్య చోప్రాకు కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దృశ్యంలో వెంకటేష్ లా మేమిది చూడలేదు, మాకిది తెలియదు తరహాలో సోషల్ మీడియాలో దాని ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడతారు. కానీ హృతిక్ రోషన్ మాత్రం ఎందుకో వార్ 2ని మర్చిపోలేకపోతున్నాడు. అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు.

ఇటీవలే దుబాయ్ లో జరిగిన ఒక ఈవెంట్ లో యాంకర్ వేదిక మీదకు హృతిక్ రోషన్ ని పిలుస్తూ సూపర్ స్టార్ అని సంబోధించాడు. దీనికి మద్దతుగా అక్కడున్న లక్షలాది అభిమానులు తమ కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. దీనికి హృతిక్ స్పందిస్తూ తన ఇటీవలి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయిందని, అయినా సరే మీరు ఇంత ప్రేమని చూపిస్తున్నందుకు సంతోషమని పరోక్షంగా వార్ 2ని గుర్తు చేశాడు. దీంతో ఒక్కసారిగా నవ్వులు వినిపించాయి. ఆ మధ్య ట్విట్టర్ లో కూడా అవసరం లేకపోయినా హృతిక్ రోషన్ వార్ 2 ప్రస్తావన తేవడం తారక్ అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది.

అయినా అయిందేదో అయిపోయిందని వదిలేయకుండా ఇంతగా గుర్తు చేయడం విచిత్రమే. ఆ మాటకొస్తే హృతిక్ రోషన్ వార్ 2 కన్నా పెద్ద డిజాస్టర్లు కెరీర్ లో చాలా చూశాడు. కైట్స్ లాంటివి కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా తేలేకపోయాయి. అలాంటిది ఇప్పుడు వార్ 2 వల్లే పెద్ద డ్యామేజ్ జరిగిందనుకోవడం కామెడీనే. ఇంత ఫ్లాపుతోనూ వార్ 2 వసూళ్లు మూడు వందల కోట్లు దాటాయి. కాకపోతే బ్రేక్ ఈవెన్ కి దూరంలో ఉండిపోవడంతో మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఓటిటిలోనూ ఇంచుమించు ఇదే రిజల్ట్ దక్కింది. థియేటర్ లో మిస్సయిన వాళ్ళు టీవీలో చూసి మిస్ కావడమే మంచిదయ్యిందని అనుకున్నారు.

Related Post

సడన్ సర్ప్రైజ్… ఎస్ఎస్ఎంబి 29 సంచారిసడన్ సర్ప్రైజ్… ఎస్ఎస్ఎంబి 29 సంచారి

ఎన్నడూ లేనిది రాజమౌళి టీమ్ హఠాత్తుగా షాకులు ఇస్తోంది. మొన్న విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ లుక్ కేవలం కొన్ని గంటల ముందు ప్రకటించి రివీల్ చేయడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. పెద్ది నుంచి వచ్చిన చికిరి చికిరి హడావిడిలో ఇది కొంచెం

కొత్త ఎమ్మెల్యేలు: చిన్న ట్రిక్స్‌తో పెద్ద విజ‌యం.. !కొత్త ఎమ్మెల్యేలు: చిన్న ట్రిక్స్‌తో పెద్ద విజ‌యం.. !

రాజ‌కీయాల్లో గెలుపు – ఓట‌ములు దోబూచులాడుతూనే ఉంటాయి. అయితే.. ఇది ఇప్ప‌టి మాట‌. కొన్నాళ్ల కింద‌ట ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. వ‌రుస‌గా ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది కీల‌క నాయ‌కుల పోరులో కూడా.. వ‌రుస‌గా

‘ఐబొమ్మ రవిని మంచి పనికి వాడుకోవాలి’‘ఐబొమ్మ రవిని మంచి పనికి వాడుకోవాలి’

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీని గురించి సీనియర్ నటుడు శివాజీ స్పందించాడు. రవిని విమర్శిస్తూనే.. అతడిది అసాధారణమైన ప్రతిభ అని అర్థమవుతోందని.. అతణ్ని మంచి పని కోసం