hyderabadupdates.com movies గాయాన్ని గుర్తు చేస్తావెందుకు హృతిక్

గాయాన్ని గుర్తు చేస్తావెందుకు హృతిక్

మర్చిపోవాల్సిన గాయం లాంటిది వార్ 2 సినిమా. రిలీజ్ ముందు వరకు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అఫ్ బాలీవుడ్ రేంజ్ లో హడావిడి చేసిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా పోయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అంచనాలను కనీసం పావు వంతు అందుకోలేక నిర్మాత ఆదిత్య చోప్రాకు కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దృశ్యంలో వెంకటేష్ లా మేమిది చూడలేదు, మాకిది తెలియదు తరహాలో సోషల్ మీడియాలో దాని ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడతారు. కానీ హృతిక్ రోషన్ మాత్రం ఎందుకో వార్ 2ని మర్చిపోలేకపోతున్నాడు. అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు.

ఇటీవలే దుబాయ్ లో జరిగిన ఒక ఈవెంట్ లో యాంకర్ వేదిక మీదకు హృతిక్ రోషన్ ని పిలుస్తూ సూపర్ స్టార్ అని సంబోధించాడు. దీనికి మద్దతుగా అక్కడున్న లక్షలాది అభిమానులు తమ కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. దీనికి హృతిక్ స్పందిస్తూ తన ఇటీవలి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయిందని, అయినా సరే మీరు ఇంత ప్రేమని చూపిస్తున్నందుకు సంతోషమని పరోక్షంగా వార్ 2ని గుర్తు చేశాడు. దీంతో ఒక్కసారిగా నవ్వులు వినిపించాయి. ఆ మధ్య ట్విట్టర్ లో కూడా అవసరం లేకపోయినా హృతిక్ రోషన్ వార్ 2 ప్రస్తావన తేవడం తారక్ అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది.

అయినా అయిందేదో అయిపోయిందని వదిలేయకుండా ఇంతగా గుర్తు చేయడం విచిత్రమే. ఆ మాటకొస్తే హృతిక్ రోషన్ వార్ 2 కన్నా పెద్ద డిజాస్టర్లు కెరీర్ లో చాలా చూశాడు. కైట్స్ లాంటివి కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా తేలేకపోయాయి. అలాంటిది ఇప్పుడు వార్ 2 వల్లే పెద్ద డ్యామేజ్ జరిగిందనుకోవడం కామెడీనే. ఇంత ఫ్లాపుతోనూ వార్ 2 వసూళ్లు మూడు వందల కోట్లు దాటాయి. కాకపోతే బ్రేక్ ఈవెన్ కి దూరంలో ఉండిపోవడంతో మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఓటిటిలోనూ ఇంచుమించు ఇదే రిజల్ట్ దక్కింది. థియేటర్ లో మిస్సయిన వాళ్ళు టీవీలో చూసి మిస్ కావడమే మంచిదయ్యిందని అనుకున్నారు.

Related Post

ఎటాక్ తర్వాత సైఫ్ ఎందుకు అలా చేశాడంటే?ఎటాక్ తర్వాత సైఫ్ ఎందుకు అలా చేశాడంటే?

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకడైన, నవాబ్‌ల కుటుంబానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ మీద ఈ ఏడాది జనవరిలో జరిగిన దాడి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక్కడే సైఫ్ ఇంట్లోకి చొరబడి సైఫ్ మీద

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు“ – అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్ క్షమాప‌ణ‌లు తెలిపారు. కోర్టు ఆదేశాల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తామ‌ని చెప్పారు. ఎక్క‌డో జ‌రిగిన పొర‌పాటుకార‌ణంగా.. ఇబ్బంది త‌లెత్తింద‌ని, కోర్టులంటే త‌మ‌కు

ప్యారడైజ్ పుకార్లకు చెక్ పెట్టాల్సిందేప్యారడైజ్ పుకార్లకు చెక్ పెట్టాల్సిందే

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ ఏ దశలో ఉందనేది స్పష్టమైన సమాచారం అందటం లేదు. మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చాక తిరిగి వేగవంతం చేశారు కానీ ఆగడం సాగడం