hyderabadupdates.com movies గూగుల్ డేటా సెంట‌ర్ మంచిదే కానీ… జ‌గ‌న్ బాధేంటంటే..

గూగుల్ డేటా సెంట‌ర్ మంచిదే కానీ… జ‌గ‌న్ బాధేంటంటే..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత గూగుల్ సంస్థ‌.. త‌న అనుబంధ సంస్థ రైడెన్‌తో క‌లిసి.. విశాఖ‌ప‌ట్నంలో గూగుల్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ స‌ర్కారుతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా సుమారు 15 బిలియన్ డాల‌ర్ల పెట్టుబ‌డి రాష్ట్రానికి రానుంది. ఉద్యోగాలు కూడా వ‌స్తాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అంతే కాదు.. విశాఖ రూపు రేఖ‌లు కూడా మారుతాయ‌న్నారు. ఇది వాస్త‌వ‌మేన‌ని ఐటీనిపుణులు, మేధావులుకూ డా ఒప్పుకొన్నారు. రాజ‌కీయంగా కొంద‌రు సానుకూల వ్యాఖ్య‌లు చేశారు.

ఇక‌, ఎంతైనా.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ ఏం చెబుతుందా? అని టీడీపీ నాయ‌కులు ఎదురు చూశారు. అదేంటో ఎంత మంది మెచ్చుకున్నా.. మ‌న‌కు గిట్ట‌ని వారు స్పందిస్తే.. అదొక మ‌జా! ఇప్పుడు తాజాగా అదే జ‌రిగింది. గూగుల్ డేటా కేంద్రంపై జ‌గ‌న్ కూడా రియాక్ట్ అయ్యారు. గురువారం మీడియాతో మాట్లాడిన జ‌గ న్‌… ఒక ప్ర‌త్యేక అంశంగా విశాఖ గూగుల్‌పై స్పందించారు. ఆయ‌న దీనిని స్వాగ‌తించారు. మెచ్చుకున్నారు. అంతేకాదు.. విశాఖ‌లో ఒక ప్ర‌త్యేక ఎకో సిస్ట‌మ్ కూడా ఏర్ప‌డుతుంద‌న్నారు.

నిజానికి టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ నోటి నుంచి ఇంత మంచి మాట వ‌స్తుంద‌ని ఊహించికూడా ఉండ‌రు. కానీ.. జ‌గ‌న్ దీనిని స్వాగ‌తించారు. విశాఖ‌లో అనేక మార్పులు వ‌స్తాయ‌ని.. అనేక హోట‌ళ్ల నిర్మాణంతో పాటు..  స్థానికంగాభూముల‌కు కూడావిలువ పెరుగుతుంద‌ని.. న‌గ‌రానికి కూడా రాక‌పోక‌లు పెరుగుతాయ‌ని చెప్పారు. వీటివ‌ల్ల ప్ర‌భుత్వానికి ఆదాయం కూడా వ‌స్తుంద‌న్నారు. అంతేకాదు.. తాను గుడ్డిగా దేనినీ వ్య‌తిరేకించ‌బోన‌ని చెప్పుకొని రావ‌డం మ‌రో విశేషం.

ఎటొచ్చీ.. జ‌గ‌న్ బాధ ఏంటంటే..

అయితే.. ఎటొచ్చీ.. జ‌గ‌న్ బాధ ఏంటంటే.. ఈ డేటా కేంద్రానికి త‌న హ‌యాంలోనే బీజం ప‌డింద‌ని.. కానీ, చంద్ర‌బాబు దీనిని చెప్ప‌డం లేద‌న్న‌ది ఆయ‌న ఆవేద‌న‌. అంతేకాదు.. కేవ‌లం గూగుల్ మాత్ర‌మే దీనిని నిర్మించ‌డం లేద‌న్నారు. దేశంలోని ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌.. అదానీ భాగ‌స్వామ్యం ఉంద‌ని.. ఆయ‌న 87 వేల కోట్ల పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారంపై త‌మ హ‌యాంలోనే నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

అయితే.. తాము స్థానికంగా 25 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాల‌ని మెలిక పెట్టామ‌ని.. చెప్పారు. సో.. మొత్తంగా ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ఎక్క‌డా చెప్ప‌డం లేద‌ని. త‌న‌కు క్రెడిట్ ఇవ్వ‌డం లేద‌ని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి ఆయ‌న దీనిని స్వాగ‌తించ‌డంతో ఇత‌ర విష‌యాలు ఎలా ఉన్నా.. టీడీపీ నాయ‌కులు హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి.

Related Post