hyderabadupdates.com Gallery గోదావ‌రి జ‌లాలు రాకుండా అడ్డుకున్న కేసీఆర్

గోదావ‌రి జ‌లాలు రాకుండా అడ్డుకున్న కేసీఆర్

గోదావ‌రి జ‌లాలు రాకుండా అడ్డుకున్న కేసీఆర్ post thumbnail image

వికారాబాద్ జిల్లా : ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోసారి మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. త‌న ప‌దేళ్ల ప‌ద‌వీ కాలంలో తెలంగాణ‌ను దోచుకున్నాడ‌ని ఆరోపించారు. తెలంగాణ పేరు చెప్పి ఆనాడు జ‌గ‌న్ రెడ్డికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇదే క్ర‌మంలో రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా కేసీఆర్ కుట్ర‌కు తెర లేపాడ‌ని ఆరోపించారు.
కేసీఆర్ స్వ‌రాష్ట్రం కోసం కాకుండా ప‌క్క రాష్ట్రం బ‌ల‌డేందుకు కృషి చేశాడ‌ని అన్నారు. గోదావరి జలాలను తీసుకెళ్లమని చంద్రబాబుకు సలహాలు ఇచ్చిన మొనగాడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు సీఎం. 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్లు అప్పగించి చూసిన కేసీఆర్ 300 టీఎంసీలు రంగారెడ్డి జిల్లాకు ఇస్తే 30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగు నీరు వచ్చి ఉండేది కాదా అని నిల‌దీశారు.
గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్య శ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. వచ్చే మూడేళ్లలో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. లక్ష్మిదేవిపల్లిలో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణతో పాటు పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలను చేపడుతామని వెల్లడించారు.
The post గోదావ‌రి జ‌లాలు రాకుండా అడ్డుకున్న కేసీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తAP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Government : ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

క‌మ‌ల్ హాస‌న్ కామెంట్స్ చిన్మ‌యి శ్రీ‌పాద సీరియ‌స్క‌మ‌ల్ హాస‌న్ కామెంట్స్ చిన్మ‌యి శ్రీ‌పాద సీరియ‌స్

చెన్నై : ఇల‌య నాయ‌గ‌న్, ప్ర‌ముఖ న‌టుడు, రాజ్య‌సభ సభ్యుడు క‌మ‌ల్ హాస‌న్ పై సీరియ‌స్ అయ్యారు ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి శ్రీ‌పాద‌. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత వైర‌ముత్తుపై గ‌తంలో త‌ను

Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌

Giriraj Singh : తెలంగాణ రైతులు పండించే పత్తిని 100% సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ (Giriraj Singh) ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కి