hyderabadupdates.com movies చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విజన్ 2020 అభివృద్ధికి ప్రతిరూపం హైదరాబాద్ అని అన్నారు. చంద్రబాబు విజన్‌కు తగ్గట్లు అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్‌ నిర్వహిస్తోందని.. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

పవన్‌కల్యాణ్‌పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశా అని వెంకటరెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి.. అదే స్నేహం కొనసాగాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై.. వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్‌లో కూడా సినిమా విడుదల కాదని హెచ్చరించారు. చిరంజీవి సూపర్‌ స్టార్‌.. ఆయన మంచోడంటూ కితాబునిచ్చిన కోమటిరెడ్డి…. రాజకీయ అనుభవం లేకే పవన్‌ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశా అంటూ ఆయన ఈరోజు వివరణ ఇచ్చారు. దీంతో ఆ వివాదానికి తెరపడినట్లు అయింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా కోమటిరెడ్డి కలుస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన సీఎం చంద్రబాబును మాత్రం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారు.

Related Post

ధనుష్ దగ్గర రూ.60 కోట్ల వాచీలుధనుష్ దగ్గర రూ.60 కోట్ల వాచీలు

ధనుష్ సినీ రంగంలోకి రావడానికి ముందే అతడి తండ్రి తమిళ పరిశ్రమలో చిన్న స్థాయి దర్శకుడు. అలా అని దాని వల్లేమీ కోలీవుడ్ అతడికి రెడ్ కార్పెట్ పరచలేదు. తొలి చిత్రం ‘తుళ్ళువదో ఎలమై’లో అతడి పాత్ర, లుక్స్ చూసి ఇతనేం

ఈ ఐఏఎస్‌… ఐపీఎస్‌… ఎంత సింపులంటేఈ ఐఏఎస్‌… ఐపీఎస్‌… ఎంత సింపులంటే

పెళ్లంటే ఆడంబ‌రాల‌కు మారు పేరుగా మారిపోయిన రోజులు ఇవి. ఎవ‌రు ఎక్కువ ఖ‌ర్చు పెడితే.. ఎంత ఘ‌నంగా చేసుకుంటే అంత గొప్ప అన్న‌ట్లు అయిపోయింది. పెద్ద‌గా డ‌బ్బులు లేని వాళ్లు సైతం అప్పులు చేసి అయినా ఘ‌నంగా పెళ్లిళ్లు చేయ‌డానికి చూస్తున్నారు.

‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!

కొంతమంది మహిళా నేతలు ఈ ఏడాది జోరుగా రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు స్థానిక రాజకీయాల్లో తమ హవా చూపించాలన్న ఉద్దేశంతో పలువురు మహిళా నేతలు దూకుడు చూపించారు. అయితే తొలి రోజుల్లో కనిపించిన ఆ దూకుడు, తర్వాత కాలంలో తగ్గడం చర్చనీయాంశంగా