hyderabadupdates.com movies చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, జంతువుల కొవ్వు కలపలేదని సీబీఐ చెబుతోందని వైసీపీ నేతలు వాదిస్తుండగా…కెమికల్స్ తో పాటు జంతువుల కొవ్వు కలిసిందని చార్జిషీట్ లోని 35వ పేజీలో స్పష్టం ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అది మహాపాపం అంటూ జగన్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తొలగిస్తున్నారు.

ఈ క్రమంలోనే కూటమి నేతలు అపచారానికి పాల్పడ్డారని, అందు కోసం రాష్ట్రంలోని పలు ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని గోరంట్లలో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఆ తర్వాత రాడ్లు, కర్రలతో రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. అంబటి ఆ ఫ్లెక్సీ ఎలా చించుతాడో చూస్తాం అంటూ…అంబటి కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అంబటి ఫైర్ అయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఆ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో అంబటి దూషించారు.

రమ్మను చంద్రబాబును చూసుకుందాం…అంటూ రాయడానికి వీలు లేని భాషతో బూతులతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా…వాడు వీడు అంటూ బూతుపురాణం చదివారు అంబటి. దీంతో, అంబటిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు అంబటి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

గుంటూరులో అంబటి కాన్వాయ్ ను కర్రలతో చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు.ఆగ్రహంతో చంద్రబాబు నాయుడి పై బూతు వ్యాఖ్యలు చేసిన అంబటి.#AmbatiRambabu pic.twitter.com/D51xUc1Si1— Gulte (@GulteOfficial) January 31, 2026

Related Post

బాలయ్య ఎఫెక్ట్: జనసేన కూల్ అయిందా..!బాలయ్య ఎఫెక్ట్: జనసేన కూల్ అయిందా..!

టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఇటీవలి కాలంలో అంతర్గతంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బాలయ్య సభలో చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో కలకలం రేపాయి. ముఖ్యంగా

13 Most Awaited Hollywood Films Releasing in 2026: From The Devil Wears Prada 2 to The Odyssey and Avengers: Doomsday13 Most Awaited Hollywood Films Releasing in 2026: From The Devil Wears Prada 2 to The Odyssey and Avengers: Doomsday

Cast: Timothée Chalamet, Zendaya, Florence Pugh, Anya Taylor-Joy, Josh Brolin, Rebecca Ferguson, Jason Momoa, Nakoa-Wolf Momoa, Ida Brooke, Robert Pattinson Director: Denis Villeneuve Language: English Genre: Epic, Space Opera, Science