hyderabadupdates.com Gallery చంద్ర‌బాబు హ‌యాంలోనే కాపుల అభివృద్ది

చంద్ర‌బాబు హ‌యాంలోనే కాపుల అభివృద్ది

చంద్ర‌బాబు హ‌యాంలోనే కాపుల అభివృద్ది post thumbnail image

అమరావతి : కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబు దేనని, ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగేలా పథకాలు అమలు అవుతున్నాయని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టం చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించారు. కాపుల సంక్షేమానికి ఏటా బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 2014-19 మధ్య విదేశీ విద్య కింద 1585 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించామన్నారు. ఆ 5 ఏళ్లలో రూ.153.11 కోట్లు కేటాయించామని, గత వైసీపీ ప్రభుత్వం కేవలం 81 మంది కాపు విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యా పథకం వర్తింప జేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత‌ 331 మంది కాపు విద్యార్థులకు విదేశీ విద్యా పథకం బకాయిలు అందజేశామన్నారు. 2024-25లో కాపు సంక్షేమానికి రూ.4,440.25 కోట్లు ఖర్చు చేశామని, 2025-26లో కాపులకు రూ.5,571.48 కోట్లు కేటాయించామని తెలిపారు.
2014-19లో సీఎం చంద్రబాబు.కాపు భవనాల నిర్మాణాలకు నిధులిచ్చారని, అయితే వైసీపీ ప్రభుత్వం గాలికి వ‌దిలేసిందని మండిపడ్డారు ఎస్. స‌విత‌. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాపు భవనాల నిర్మాణాలను పున: ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం కాపుల కోసం ఏడాదికి రూ.3,580 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కాపుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. రూ.38.63 కోట్లతో ఆటో డ్రైవర్ల సేవా పథకం అమలు చేశామని, ఈ పథకం కింద 25,756 మంది కాపు లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధం భృతి పథకం కింద రూ.1.02 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ పథకం ద్వారా 511 మంది కాపులకు లబ్ధి కలిగిందన్నారు.
The post చంద్ర‌బాబు హ‌యాంలోనే కాపుల అభివృద్ది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..

మంచి మాట ఎవ్వరు చెప్పినా వినాలంటారు పెద్దలు. నాకు తోచింది మాత్రమే చేసుకుంటూ పోతాననే మోనార్క్ పోకడలు లేకుండా.. పెద్దా చిన్నా స్థాయీ భేదాలను ఎంచకుండా మంచి సలహా ఎవ్వరు చెప్పినా సరే.. విని, ఆచరించడానికి పూనుకున్నప్పుడే.. పాలకులు కూడా న్యాయం

ప‌ద‌వుల కంటే ప్ర‌జల మ‌ధ్య ఉండ‌టం ఇష్టంప‌ద‌వుల కంటే ప్ర‌జల మ‌ధ్య ఉండ‌టం ఇష్టం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు, జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు తాజాగా పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది.

తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!

అవును మరి.. వివాదం పుట్టించినా సరే.. నిజాలను మాత్రమే ప్రచారం చేస్తే దానికి పెద్ద ప్రజాదరణ ఉండదు. సోషల్ మీడియాల్లో వైరల్ చేయడమే జీవితంగా అందరూ బతుకుతున్న రోజులివి. మరి మామూలు వివాదానికి కూడా సెలబ్రిటీని జోడిస్తే.. దానికి క్రేజ్ పెరుగుతుంది