hyderabadupdates.com Gallery చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు

చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు

చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు post thumbnail image

​అమరావతి : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తన వల్ల సభా గౌరవం దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు . యువతకు , విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో లోకేష్ ‘మాక్ అసెంబ్లీ’ అనే కార్యక్రమాన్ని రూపొందించార‌ని అన్నారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించిందని, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం దీన్ని ప్రశంసించారని స్పీకర్ గుర్తుచేశారు.

నిన్న గవర్నర ప్రసంగిస్తున్నప్పుడు సభలో జరిగిన దృశ్యాలు నన్ను కలచివేశాయి. సభ్యులు నినాదాలు చేస్తూ, కాగితాలు చింపి వేయడం వంటి చర్యలు అత్యంత బాధాకరం అని స్పీకర్ అన్నారు. వేలాది మంది పోటీ పడితే కేవలం 175 మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఈ సభలో సభ్యులుగా ఉండటం అని గుర్తించాల‌న్నారు. ఆ గౌరవాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా విద్యాసంస్థల నుండి విద్యార్థులు అసెంబ్లీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని స్పీకర్ తెలిపారు. మనం చేసే పనులను చూసి ఆ పసిపిల్లలు ఏం నేర్చుకుంటారు? చట్ట సభలంటే వారికి చులకన భావం ఏర్పడితే దాన్ని మనం మళ్ళీ మార్చలేమ‌ని ఆందోళ‌ణ వ్య‌క్తం చేశారు.
The post చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌త్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారించింది.

47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామ‌న్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల

యూనిఫాం సివిల్ కోడ్ కు ఏకాభిప్రాయం అవ‌స‌రంయూనిఫాం సివిల్ కోడ్ కు ఏకాభిప్రాయం అవ‌స‌రం

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి యూనిఫాం సివిల్ కోడ్ గురించి ప్ర‌స్తావించారు. ఇందుకు సంబంధించి ఏకాభిప్రాయంతో యూనిఫాం సివిల్ కోడ్ ను రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎట్టి