hyderabadupdates.com movies చరణ్ బన్నీ ఇద్దరూ షాకులిస్తున్నారు

చరణ్ బన్నీ ఇద్దరూ షాకులిస్తున్నారు

సోషల్ మీడియాలో కొన్ని టాపిక్స్ విపరీతమైన డిస్కషన్ కు నోచుకుంటున్నాయి. వాటిలో మొదటిది పెద్ది పోస్ట్ పోన్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచమంతా కోడై కూస్తున్నా నిర్మాణ సంస్థ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఉండటంతో అభిమానుల్లో అసహనం వ్యక్తమవుతోంది. అయితే కొత్త డేట్ నిర్ణయించడం అనేది హఠాత్తుగా తీసుకునేది కాదు. దాని వెనుక ఎన్నో క్యాలికులేషన్లు చేసుకోవాలి. రెండు తేదీలు మారాయి కాబట్టి ఈసారి తొందరపడే ఛాన్స్ ఎంత మాత్రం లేదు.

సో అభిమానుల ఆశ నిరాశల సంగతి ఎలా ఉన్నా పెద్ది మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. ఇతర నిర్మాతలు ఇప్పుడు ఆఘమేఘాల మీద తమ సినిమాలను అదే డేట్ కి వదిలే సాధ్యాసాద్యాల గురించి ఎనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా వీడియో కంటెంట్ వస్తుందేమోనని బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే టైటిల్ రివీల్ చేస్తూ ఒక పోస్టర్ తప్ప ఇంకెలాంటి అప్డేట్ ఉండకపోవచ్చని విశ్వసనీయ సమాచారం.

అదే జరిగితే ఇది కూడా కొంచెం అసంతృప్తి కలిగించేదే అవుతుంది. దీని గురించి ఎక్కువ హైలైట్ కాకూడనేమో కాబోలు రేసు గుర్రం రీ రిలీజ్ గురించి ఎక్స్, ఇన్స్ టాలో తెగ హడావిడి చేస్తున్నారు. బన్నీ పుట్టినరోజు కానుకని ఘనంగా దాంతో థియేటర్లలో సెలెబ్రేట్ చేసుకుందామని పిలుపు ఇస్తున్నారు. మొన్న మగధీర స్పెషల్ షోలలో పెద్ది పాటలు, టీజర్లు ఎంజాయ్ చేసినట్టు బన్నీ అభిమానులు రేసు గుర్రంలో ఏఏ 22 వీడియోని ఆస్వాదించే అవకాశం రాకపోవచ్చు.

షూటింగ్ ఇంకా చాలా బాలన్స్ ఉండటంతో టీజర్ విషయంలో దర్శకుడు అట్లీ హడావిడి పడదలుచుకోలేదట. ఐకాన్ స్టార్ కూడా దానికి మద్దతు ఇవ్వడంతో టీజర్ ప్లాన్ డ్రాప్ అయ్యారని అంటున్నారు. వచ్చే ఏడాది ఎప్పుడు సినిమాని రిలీజ్ చేయాలనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల విషయంలో తొందరపాటు వద్దనేది టీమ్ నిర్ణయంగా కనిపిస్తోంది. చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2తో పాటు ఏఏ 22 టీజర్ ని గ్రాండ్ గా లాంచ్  చేసే ఆలోచనలో సన్ పిక్చర్స్ ఉందట.

Related Post

సుధీర్ బాబు అంచనా మళ్ళీ తప్పిందాసుధీర్ బాబు అంచనా మళ్ళీ తప్పిందా

టాలీవుడ్ లో చాలా తక్కువ హీరోలు మనసుని, ఒంటిని బాగా కష్టపెట్టి సినిమాలు చేస్తారు. వాళ్లలో సుధీర్ బాబుని చేర్చొచ్చు. అలాని తనేదో బెస్ట్ పెరఫార్మర్ అని చెప్పడం కాదు ఉద్దేశం. తనవరకు లోపం లేకుండా విభిన్న కథలను ఎంచుకునే ప్రయత్నమైతే

OTT Review: Stranger Things 5, Volume 1 – Telugu dubbed series on NetflixOTT Review: Stranger Things 5, Volume 1 – Telugu dubbed series on Netflix

Web Series Name : Stranger Things 5: Volume 1 Streaming Date : Nov 27, 2025 Streaming Platform : Netflix 123telugu.com Rating : 3.25/5 Starring : Winona Ryder, David Harbour, Millie