hyderabadupdates.com Gallery చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి

చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి

చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి post thumbnail image

హైద‌రాబాద్ : భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌. రూ. 1000 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు ఇందులో కీల‌క పాత్ర పోషించిన హాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆ మ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా పేర్కొంది. ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. సెన్సేష‌న్ గా మారాయి. ప్ర‌స్తుతం ప్రిన్స్ మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్ క‌లిసి న‌టించిన వార‌ణాసికి సంబంధించి ఇటీవ‌లే కీల‌క అప్ డేట్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. వ‌చ్చే ఏడాది 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఈసినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం వార‌ణాసి షూటింగ్ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ కొన‌సాగుతోంది.
వార‌ణాసి చిత్రం అంటార్కిటికాలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఏకైక చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది . ఈ మూవీ రికార్డుల పుస్తకాల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతికూలమైన , కఠినమైన నిబంధనలు గల చిత్రీకరణ ప్రదేశాలలో ఒక‌టిగా ఉంది అంటార్కిటికా. వీట‌న్నింటిని త‌ట్టుకుని ప్రిన్స్ మ‌హేష్ బాబు పై కీలక సన్నివేశాలను ప్లాన్ చేసి, చిత్రీకరించి ఒక అరుదైన ప్రపంచ ఘనతను సాధించింది. ఈ ప్రాజెక్ట్ వేగంగా పురోగమిస్తోంది. తీవ్రమైన చలి, ఊహించలేని వాతావరణ పరిస్థితులు, కఠినమైన పర్యావరణ నిబంధనలను ఎదుర్కొంటోంది. స్వచ్ఛమైన తెల్లని ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో సినిమాలోని కీలక భాగాలను చిత్రీకరించినట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.
The post చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీఆర్ఎస్ దిమ్మెల‌ను కూల్చే ద‌మ్ముందా..?బీఆర్ఎస్ దిమ్మెల‌ను కూల్చే ద‌మ్ముందా..?

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు , తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోరం అధ్య‌క్షుడు ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. సోయి త‌ప్పిన మాట‌లు, సొల్లు క‌బుర్లు చెబుతూ తెలంగాణ‌పై నిత్యం విషం చిమ్మే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని

హైద‌రాబాద్ లో ఘ‌నంగా కైట్, స్వీట్ ఫెస్టివ‌ల్హైద‌రాబాద్ లో ఘ‌నంగా కైట్, స్వీట్ ఫెస్టివ‌ల్

హైద‌రాబాద్ : సంక్రాంతి ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లోని ప‌రేడ్ గ్రౌండ్స్ లో నిర్వ‌హంచిన అంతర్జాతీయ కైట్ , స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఈ మూడు రోజుల ఉత్సవం

Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?

Sabarimala : శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గిపోవడంపై తలెత్తిన వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాలకు తాపడం దాత, బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్‌కి (Unnikrishnan) అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని,