hyderabadupdates.com movies చిరంజీవిని వాడుతున్న జెట్లీ సింహం

చిరంజీవిని వాడుతున్న జెట్లీ సింహం

ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు బేలగా ఉన్న టైంలో డార్లింగ్ రీ రిలీజ్ ఒక్కటే కాస్త ఊపిరి పోసింది. కేరళలో విరగబడి ఆడిన వాలా 2 ఏపీ తెలంగాణలో నా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేసింది. దాంతో పాటు వచ్చినవి, అంతకు ముందు వారం రిలీజైనవి పట్టుమని వీకెండ్ దాకా కూడా స్ట్రాంగ్ గా నిలబడలేదు. ఒక్క డెకాయిట్ మాత్రం ఉన్నంతలో బెటర్ గా ఆడి బయ్యర్లకు రిలీఫ్ ఇచ్చింది.

మే ఒకటి విషయానికి వస్తే జెట్లీ, గాయపడ్డ సింహం రెండు సినిమాలు చిరంజీవిని బాగా వాడేసుకున్నాయని సమాచారం. జెట్లీ దర్శకుడు రితేష్ రానా మొదటి నుంచి మెగాస్టార్ వీర ఫ్యాన్. ఆయన రెఫరెన్సులు లేకుండా కథలు రాయడు. జెట్లీ ప్రమోషన్లలో హీరో సత్య చిరు టీ షర్ట్ వేసుకొచ్చినప్పుడే ఈ మ్యాటర్ అర్థమైపోయింది. ఇక గాయపడ్డ సింహంలో ఏకంగా చిరు ఛార్ట్ బస్టర్ సాంగ్ గోలీమార్ ని రీమిక్స్ చేశారట. ఇది దొంగ మూవీ నుంచి తీసుకున్న సూపర్ హిట్ పాట.

ఇలా చిరుని వాడుకోవడం ఇప్పుడేం కొత్త కాకపోయినా న్యూ ఏజ్ డైరెక్టర్లు కూడా ఇదే పద్దతి ఫాలో కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అప్పుడెప్పుడో అప్పుల అప్పారావుతో మొదలుపెట్టి ఇప్పటి జెట్లీ, గాయపడ్డ సింహం దాకా చిరంజీవి వాడకం అంతకంతా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. మన శంకరవరప్రసాద్ గారుతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన చిరంజీవి రెగ్యులర్ గా తెరమీద కనిపించకపోయినా ఈ రూపంలో ఫ్యాన్స్ కి కనిపిస్తూనే ఉన్నారు.

ఇక జెట్లీ, గాయపడ్డ సింహం సంగతి చూస్తే ప్రమోషన్లు ఉదృతంగా జరుగుతున్నాయి. ఇంకా జనాల అటెన్షన్ పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. ఇమేజ్ ఉన్న హీరోలు కాకపోవడం వల్ల దర్శకులు పూర్తిగా కామెడీ, కంటెంట్ మీదే ఆధారపడుతున్నారు. అవి కనక క్లిక్ అయితే ఇతరత్రా పోటీ పెద్దగా లేకపోవడం వల్ల సులభంగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు అందుకోవచ్చు. బడ్జెట్ పరంగా నిర్మాతలు చాలా సేఫ్ గేమ్ ఆడటం వల్ల బాగుందనే మాట వస్తే చాలు హిట్టు ముద్ర వేయించుకుంటాయి.

Related Post

నితిన్‌కు కథ చెబితే… సిద్ధు పేరు చెప్పాడునితిన్‌కు కథ చెబితే… సిద్ధు పేరు చెప్పాడు

ప్రపంచవ్యాప్తంగా ఏ సినీ పరిశ్రమను తీసుకున్నా లేడీ డైరెక్టర్లు తక్కువగానే కనిపిస్తారు. తెలుగులో మహిళా దర్శకులు మరింత తక్కువ. అందులో సక్సెస్ అయిన వాళ్లు మరింత అరుదుగా కనిపిస్తారు. ఇప్పుడు ఆ అరుదైన జాబితాలోకి చేరాలనే చూస్తోంది నీరజ కోన. తన ఇంటి

13 వేల కోట్ల రాయల్ డీల్ వెనుక ఎవరున్నారు?13 వేల కోట్ల రాయల్ డీల్ వెనుక ఎవరున్నారు?

ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. కానీ ఇప్పుడు ఒక జట్టు ఏకంగా బిలియన్ డాలర్ల మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కల్ సోమనీ నేతృత్వంలోని బృందం సుమారు 1.63 బిలియన్ డాలర్లకు (దాదాపు 13,600 కోట్ల రూపాయలు)