hyderabadupdates.com movies `చిరంజీవి` పేరును వాడుకుంటే జైలుకే: కోర్టు తీర్పు

`చిరంజీవి` పేరును వాడుకుంటే జైలుకే: కోర్టు తీర్పు

సోష‌ల్ మీడియా స‌హా ప్రైవేటు సంస్థ‌లు కూడా ఇటీవ‌ల కాలంలో సెల‌బ్రిటీల పేర్లు, ఫొటోల‌ను వినియోగించ‌డం ఫ్యాషన్‌గా మారిపోయింది. కొన్ని కొన్ని సంద‌ర్బాల్లో సెల‌బ్రిటీల గ‌ళాన్ని కూడా అనుక‌రిస్తున్నారు. ఇక‌, ఏఐ వ‌చ్చిన త‌ర్వాత‌.. మార్ఫింగ్‌వీడియోలు సృష్టించి.. కంటెట్‌తో ప్ర‌చారం చేస్తున్నారు. వీటి వ‌ల్ల చాలా సార్లు త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని.. న‌టులు.. ముఖ్యంగా నాగార్జున‌, చిరంజీవి, వెంక‌టేష్ వంటివారు చెబుతున్నారు. కానీ.. ఈ ప‌రంప‌ర మాత్రం కొన‌సాగుతోంది.

ఇటీవ‌ల కొంద‌రు న‌టులు.. వీరిలో శ్రీకాంత్ కూడా ఉన్నారు. హైద‌రాబాద్ సిటీ కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. త‌మ పేరుప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం క‌లిగించేలా త‌మ ఫొటోలు.. వాయిస్‌, వీడియోలు వాడుకుంటున్నార‌ని.. పిటిష‌న్ల‌లో పేర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా శ‌నివారం జ‌రిగిన విచార‌ణ‌లో మెగా స్టార్ చిరంజీవి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ చిరంజీవి ఫొటోలు, వీడియోల‌ను, ఆయ‌న వాయిస్ను కూడా వినియోగించ‌రాద‌ని తెలిపింది.

అయితే.. ఆయ‌న అనుమ‌తి ఉంటే వినియోగించుకోవ‌చ్చ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ అనుమ‌తి లేకుండా వినియోగించుకున్న‌ట్టు తేలితే.. స‌ద‌రు వ్యక్తులు, సంస్థ‌ల‌పై.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని.. జైల్లో వేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. “టీఆర్పీ రేటింగ్‌, వ్య‌క్తుల స్వ‌లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి“ అని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 30 మంది ఇలా దుర్వినియోగం చేశార‌ని గుర్తించిన నేప‌థ్యంలో వారికి నోటీసులు జారీ చేసింది.

ఏం చేయ‌రాదు?

+ చిరంజీవి పేరును, ఫొటోల‌ను ప్ర‌క‌ట‌న‌ల‌కు వినియోగించ‌రాదు.+ వ్య‌క్తిగ‌త హాస్యం పేరుతోనూ ఆయ‌న ఫొటోలు, వీడియోల‌ను మార్ఫింగ్ చేయ‌రాదు.+ ఐఏ ఆధారిత వీడియోల్లోనూ ఆయ‌న పేరును, ఫొటోల‌న వాడ‌రాదు.+ MEGA STAR, CHIRU, ANNAYYA పేర్లతో డిజిటల్ మాధ్య‌మాల్లో ప్ర‌క‌ట‌న‌లు చేయ‌రాదు.

Related Post