hyderabadupdates.com movies చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ నిన్న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తో వసూళ్లు పెంచుకుంటోంది. ఆయన పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న సైకో కిల్లర్ పాత్ర చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. గతంలో స్వలింగసంపర్కుడిగా నటించి ఆశ్చర్యపరిచిన మమ్ముట్టి ఇప్పుడీ క్యారెక్టర్ తో ఇంకో షాక్ ఇచ్చారు. దీంతో కొందరు ఒక మన సీనియర్ స్టార్లు కూడా ఇలా వయసుకు తగ్గట్టు కొత్త ప్రయోగాలు చేయాలని, ఎప్పుడూ మాస్ అంటూ మూసలో ఉండకూడదని సోషల్ మీడియాలో మమ్ముట్టితో పోలిక తెస్తున్నారు.

ఇది ముమ్మాటికీ రాంగే. ఎందుకంటే కేరళ, ఏపీ – తెలంగాణ ఆడియన్స్ అభిరుచుల్లో చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండటం వల్ల క్లాస్ కంటెంట్ కి ఆదరణ దక్కడం సహజం అందుకే ఎక్కువ ఇంగ్లీష్ టైటిల్స్ పెడతారు. అందులోనూ గత అయిదేళ్లలో సైకో కిల్లింగ్ జానర్లో అక్కడ చాలా సినిమాలు వచ్చాయి. సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. కానీ మన ప్రేక్షకులకు ఆ జానర్ సూటవ్వదు. అందుకే అరుదుగా అలాంటి ఎక్స్ పరిమెంట్లు జరుగుతాయి. అప్పుడెప్పుడో భూమిక అనసూయ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు లాంటి కొన్ని హిట్లు మాత్రమే కనిపిస్తాయి. ఇది మనకు వాళ్లకు ఉన్న వ్యత్యాసం.

ఇక పోలిక విషయానికి వస్తే మనకు మాస్ సపోర్ట్ ఎక్కువ. ప్రయోగాలతో ఆ సెక్షన్ ఆడియన్స్ ని మెప్పించలేం. అందుకే చిరంజీవి నయనతారతో డ్యూయెట్ పాడాలి, బాలయ్య సంయుక్త మీనన్ తో డాన్స్ చేయాలి. అప్పుడే విజిల్స్ క్లాప్స్ పడతాయి. వెంకటేష్, నాగార్జున కూడా దీనికి మినహాయింపు కాదు. సేఫ్ గేమ్ నుంచి బయటికి వద్దామని చేసిన కుబేర, సైంధవ్ లాంటివి స్వంత ఫ్యాన్స్ కే నచ్చలేదు. నా సామిరంగాలో అల్లరి ఎంజాయ్ చేసిన అభిమానులు కూలిలో విలనిజంని ఒప్పుకోలేదు. మనకు ఆవనూనెతో చేసిన ఆవకాయ పచ్చడి ఇష్టం. కేరళ వాళ్ళకు కొబ్బరినూనెతో వండిన పదార్థాలు ఇష్టం. ఎవరి టేస్టు వాళ్లదే. అందరూ రైటే.

Related Post

ప్యారడైజ్‌ లో డ్రాగన్ భామ కన్ఫర్మ్ప్యారడైజ్‌ లో డ్రాగన్ భామ కన్ఫర్మ్

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ చిత్రీకరణ వేగంగానే జరుగుతుందని తెలుస్తోంది. అనుకున్న ప్రకారమే మార్చి 26న తమ చిత్రాన్ని విడుదల చేయడానికి చూస్తోంది చిత్ర బృందం. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం అధికారికంగా

నటి ప్రత్యూష మృతి కేసు.. తేల్చేసిన సుప్రీంనటి ప్రత్యూష మృతి కేసు.. తేల్చేసిన సుప్రీం

రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించంది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను నిందితుడు సిద్దార్థ రెడ్డి సవాలు చేస్తూ వేసిన