hyderabadupdates.com Gallery చెన్నై చంద్ర‌మా కోల్ క‌తా కు శాప‌మా..!

చెన్నై చంద్ర‌మా కోల్ క‌తా కు శాప‌మా..!

చెన్నై చంద్ర‌మా కోల్ క‌తా  కు శాప‌మా..! post thumbnail image

చెన్నై : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో ఆరంభంలో నిరాశ ప‌రిచిన రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ మెల మెల్ల‌గా త‌ర్వాతి మ్యాచ్ ల‌లో పుంజుకుంది. మొద‌ట‌గా త‌డ‌బ‌డిన సీఎస్కే ఆ త‌ర్వాత పుంజుకుంది. టోర్నీలో అత్యంత బ‌ల‌మైన ఢిల్లీ క్యాపిటల్స్ పై సూప‌ర్ షో చేసింది. గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. తొలి మూడు మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా విఫ‌ల‌మైంది సీఎస్కే. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం. త‌న‌ను ఏరికోరి ఏకంగా రూ. 18 కోట్ల‌కు తీసుకుంది. ఇది అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. మ‌రో వైపు చెన్నైకి ఆయువుప‌ట్టుగా ఉన్న మ‌హేంద్ర సింగ్ ధోనీ ఉన్న‌ట్టుండి సంజు శాంస‌న్ వైపు మొగ్గు చూపడం విస్తు పోయేలా చేసింది.
కానీ ఆశించిన మేర రాణించ‌లేదు శాంస‌న్. వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌లో 9, 6, 7 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. ఈ త‌రుణంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్ లో రెచ్చి పోయాడు త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ఏకంగా సెంచ‌రీతో క‌దం తొక్కాడు. అజేయంగా 115 ప‌రుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. తాజాగా మాజీ ఛాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో 192 ప‌రుగులు చేసింది చెన్నై సూప‌ర్ కింగ్స్. మ‌రోసారి కెప్టెన్ రుతురాజ్ విఫ‌లం అయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు సంజూ శాంస‌న్ , ఆయుష్ మాత్రే. ఇద్ద‌రూ క‌లిసి దుమ్ము రేపారు. సొంతగడ్డపై జరిగిన పోరులో చెన్నై 32 పరుగుల తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది కేకేఆర్ కు.
The post చెన్నై చంద్ర‌మా కోల్ క‌తా కు శాప‌మా..! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌ల్న‌ల్ సీకే నాయుడు అవార్డు అందుకోవ‌డం అదృష్టంక‌ల్న‌ల్ సీకే నాయుడు అవార్డు అందుకోవ‌డం అదృష్టం

న్యూఢిల్లీ : భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. న్యూఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన బీసీసీఐ న‌మాన్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం లో విశిష్ట అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఇదిలా ఉండగా కల్నల్ సికె నాయుడు

శ్రీ‌లంక‌తో భార‌త‌దేశం బంధం బ‌లోపేతంశ్రీ‌లంక‌తో భార‌త‌దేశం బంధం బ‌లోపేతం

ఢిల్లీ : శ్రీ‌లంక అధ్య‌క్షుడు అనుర కుమార దిస‌నాయ‌కేతో శుక్ర‌వారం భేటీ అయ్యారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఇండియా ఏఐ ఇంపాక్ట్ 2026 స‌ద‌స్సులో ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌లు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచాన్ని ఏఐ శాసిస్తోంద‌ని , ఈ

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ! తొమ్మిది మంది మృతి !Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ! తొమ్మిది మంది మృతి !

      మహారాష్ట్రలో పుణే – బెంగళూరు జాతీయ రహదారిలోని నవలే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్.. ఎదురుగా వస్తున్న వాహనాలను వేగంగా ఢీ కొట్టంది. ఆ వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.