hyderabadupdates.com Gallery చెరువుల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి

చెరువుల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి

చెరువుల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి post thumbnail image

హైద‌రాబాద్ : ఇక నుంచి చెరువుల‌ను అందంగా తీర్చిదిద్ద‌డంతో పాటు ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చి దిద్దాల‌ని ఆదేశించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. మాధాపూర్‌లోని త‌మ్మిడికుంట‌తో పాటు సున్నం చెరువుల‌ను ప‌రిశీలించారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి అధికారులతో స‌మీక్షించారు. రెండు నెల‌ల్లో చెరువుల అభివృద్ధి ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆక‌స్మికంగా త‌మ్మిడికుంట‌ను ప‌రిశీలించిన నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ సంద‌ర్శించారు. ఐటీ కేంద్రానికి చేరువుగా ఉన్న త‌మ్మిడికుంటను ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్ద‌డ‌మే కాకుండా.. ఇక్క‌డ‌కు వ‌స్తే ఒత్తిడి కూడా దూర‌మ‌మ‌య్యేలా అభివృద్ధి చేయాల‌ని సీఎం సూచించిన విష‌యాన్ని చెరువు అభివృద్ధి ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారుల‌కు క‌మిష‌న‌ర్ చెప్పారు.
చెరువు చుట్టూ ప‌చ్చ‌ద‌నం నిండుగా క‌నిపించాల‌ని సూచించారు. బ‌య‌ట కంటే చెరువు చెంత 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు త‌క్కువ ఉండేలా ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించాల‌ని సూచించారు. చెరువు చుట్టూ పాత్ వేలు, కూర్చొని సేద దీరేందుకు వీలుగా సీటింగ్ వ్య‌వ‌స్థ‌, పార్కులు, ప‌చ్చిక బైళ్లు.. ఉండేలా చూడాల‌న్నారు. చెరువుల చుట్టూ ఉన్న ప్ర‌భుత్వ భూములల‌ను గుర్తించాల‌ని అన్నారు. వాటిని పూర్తి స్థాయిలో విచారించి స్వాధీనం చేసుకుని చెరువు అభివృద్ధిలో భాగం చేయాల‌ని అధికారుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ఆక్ర‌మ‌ణ‌దారుల ప‌త్రాల‌ను ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. సున్నం చెరువు చెంత స‌ర్వే నంబ‌రు 30, 31కి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. ప్ర‌భుత్వ భూమి ఉంటే అంగుళం కూడా పోకుండా ర‌క్షించాల‌ని అన్నారు. ఈ రెండు స‌ర్వే నంబ‌ర్ల మ‌ధ్య ఉన్న ప్ర‌భుత్వ భూమికి సంబంధించిన వివ‌రాల‌ను అడిగి తెలుసు కోవ‌డ‌మే కాకుండా.. క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. త‌మ్మిడికుంట చెరువుకు పై భాగంలో కింది భాగంలో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను త‌మ‌దిగా క్లైమ్ చేస్తున్న వారి ప‌త్రాల‌ను ప‌రిశీలించాల‌న్నీరు.
The post చెరువుల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దంరాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దం

హైద‌రాబాద్ : న‌టి పూన‌మ్ కౌర్ నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. నిన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ను ఏకి పారేసిన న‌టి తాజాగా త‌న‌కు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, అమెథీ ఎంపీ

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆదివారం సీఈసీ ఆయా రాష్ట్రాల‌లో నిర్వ‌హించే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు విడ‌త‌లుగా పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 9న అస్సాం, కేరళ,

రాధాకృష్ణా నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌నురాధాకృష్ణా నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ను

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క నిప్పులు చెరిగారు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మ‌ధ్య‌న మీడియా త‌న స్థాయిని దాటి వ్య‌క్తిగ‌త హ‌న‌నం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని