hyderabadupdates.com Gallery చెరువుల అభివృద్ధిలో హైడ్రా ప‌నితీరు భేష్‌

చెరువుల అభివృద్ధిలో హైడ్రా ప‌నితీరు భేష్‌

చెరువుల అభివృద్ధిలో హైడ్రా ప‌నితీరు భేష్‌ post thumbnail image

హైద‌రాబాద్ : ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దాల‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యానికి హైడ్రా చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు అన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ ప‌రిర‌క్ష‌ణ‌లో హైడ్రా చొర‌వ‌ను కొనియాడారు. మ‌రీ ముఖ్యంగా న‌గ‌రంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా ఎంతో కృషి చేస్తోంద‌న్నారు. చెరువుతో పాటు.. ఆ ప‌రిస‌ర ప్రాంతాల రూపురేఖ‌లు మారి పోతున్నాయ‌న్నారు. వ‌ర‌ద నివార‌ణ‌తో పాటు.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు, జీవ వైవిధ్యానికి, భూగ‌ర్భ జ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు చెరువుల ప్రాధాన్య‌త‌ను గుర్తించే వాటి అభివృద్ధికి ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త‌ను ఇస్తోంద‌న్నారు. ఉప్ప‌ల్ న‌ల్ల చెరువు అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీ పి. మ‌హేంద‌ర్ రెడ్డితో క‌లిసి ఐటీ మంత్రి ఉప్ప‌ల్ న‌ల్ల‌చెరువును సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా చెరువును ఎలా అభివృద్ధి చేస్తున్నారు.. ఏలా తీర్చిదిద్దుతున్నారు అనే విష‌యాల‌ను అక్క‌డ చెరువు ప‌నులను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థ య‌జ‌మాని మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్‌ను అడిగి తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన 3డీ న‌మూనాల‌ను మంత్రి ప‌రిశీలించారు.
ఉప్ప‌ల్ న‌ల్ల‌చెరువు ఫ్రంట్ ఎలివేష‌న్ బాగుండాల‌ని మంత్రిసూచించారు. వ‌రంగ‌ల్‌కు వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారికి ఆనుకుని ఈ చెరువుంది . దాదాపు కిలోమీట‌రు పొడ‌వునా చెరువు విస్త‌రించి ఉంది. రోడ్డు పొడవునా ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాల‌న్నారు. చెరువు చుట్టూ 2 కిలోమీట‌ర్ల‌కు పైగా వాకింగ్ ట్రాక్ వ‌స్తుంద‌ని.., చిన్న పిల్ల‌లు ఆడుకునే ప్లే ఏరియా, చెరువు చుట్టూ సీటింగ్ సౌక‌ర్యం, ప‌చ్చిక బైళ్లు, పార్కులు, అన్ని వ‌య‌సుల వారికి వ్యాయాయ ప‌రిక‌రాలు అందుబాటులోకి వ‌స్తున్నాయ‌ని అక్క‌డ ప‌నులు చేప‌డుతున్న వారు మంత్రికి తెలిపారు. మురుగు నీరు క‌ల‌వ‌కుండా డైవ‌ర్ట్ కాలువ‌లు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. ఆక్ర‌మ‌ణ‌ల‌తో 55 ఎక‌రాల‌కు కుంచించుకు పోయిన చెరువును 69 ఎక‌రాల‌కు విస్త‌రించామ‌ని.. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఇప్ప‌టికే ప‌లుమార్లు ఇక్క‌డికి వ‌చ్చి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించార‌న్నారు. ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు విష‌యంలో హైడ్రా అధికారుల చొర‌వ చెరువు విస్త‌ర‌ణ‌కు దోహ‌ద ప‌డింద‌ని తెలిపారు. చెరువులో 3 మీట‌ర్ల మేర పూడిక‌ను తొల‌గించామ‌ని . ప్ర‌ధాన ద్వారం చెరువుకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు.
The post చెరువుల అభివృద్ధిలో హైడ్రా ప‌నితీరు భేష్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Supreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలిSupreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలి

        విచారణలో ఉన్న (అండర్‌ ట్రయల్‌) నిరుపేద ఖైదీల బెయిలు పూచీకత్తు సొమ్ము విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ

AP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటనAP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన

    విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయడం లేదని… ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని విశ్వాసం

సుకుమార్‌ తో చరణ్‌ మూవీ ఎప్పుడంటే!సుకుమార్‌ తో చరణ్‌ మూవీ ఎప్పుడంటే!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పెద్ది షూటింగ్ ఇప్పుడు పూణే ప్రాంతంలో వేగంగా సాగుతోంది. ఇది గ్రామీణ నేపథ్యంలోని క్రీడల ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా