hyderabadupdates.com Gallery చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్ post thumbnail image

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. రికార్డ్ బ్రేక్ చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి దిగిన భార‌త ఓపెన‌ర్లు దుమ్ము రేపారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. నిన్న‌టి దాకా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న అభిషేక్ శ‌ర్మ స‌త్తా చాటాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఇక కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. త‌ను 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో 89 ర‌న్స్ చేశాడు. భారీ స్కోర్ సాధించ‌డంలో కీల‌క భూమిక పోషించాడు. ఇంకో వైపు అభిషేక్ శ‌ర్మ త‌క్కువ తిన‌లేదు. త‌ను 21 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ చేశాడు.
ఇంగ్లండ్ తో జ‌రిగిన సెమీస్ లో ఆడిన భార‌త జ‌ట్టునే తిరిగి ఫైన‌ల్ మ్యాచ్ లో కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. ఇక సంజూ శాంస‌న్ అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ఫార్మాట్ లో సంజు సామ్సన్ వరుసగా రెండు నాకౌట్ మ్యాచ్‌లలో, సెమీఫైనల్ , ఫైనల్‌లో యాభై పరుగులు చేశాడు. గతంలో విరాట్ కోహ్లీ , షాహిద్ అఫ్రిది మాత్రమే ఈ ఘనతను సాధించారు. అభిషేక్ అవుట్ అయ్యాక మైదానంలోకి వ‌చ్చిన ఇషాన్ కిష‌న్ సూప‌ర్ షో చేశాడు. త‌ను కూడా ఉతికి ఆరేశాడు. 25 బాల్స్ ఎదుర్కొని 54 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక ఆఖ‌రులో వ‌చ్చిన శివ‌మ్ దూబే శివాలెత్తాడు. త‌ను కేవ‌లం 8 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 26 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఇండియా 5 వికెట్లు కోల్పోయి 255 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ ముందు 256 ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.
The post చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ramachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులుRamachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులు

Ramachandra Yadav : నక్కపల్లి బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారుల వద్దకు వెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ను (Ramachandra Yadav) పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయరదారిని మత్స్యకారులు దిగ్బంధించారు. పోలీసుల

NDA: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంNDA: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం

    ఉత్కంఠ భరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 సీట్లలో పోటీ చేసిన ఎన్డీఏ కూటమి దాదాపు 203 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్

అమ‌రావ‌తి : ఏపీ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. దేశంలోనే అంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని ప్ర‌క‌టించారు మంత్రి అచ్చెన్నాయుడు, దీనిద్వారా భూ యజమానులకే కాకుండా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఒక గుర్తింపు