hyderabadupdates.com Gallery చెల‌రేగిన బ్యాట‌ర్లు భార‌త్ భారీ స్కోరు

చెల‌రేగిన బ్యాట‌ర్లు భార‌త్ భారీ స్కోరు

చెల‌రేగిన బ్యాట‌ర్లు భార‌త్ భారీ స్కోరు post thumbnail image

చెన్నై : చావో రేవో తేల్చు కోవాల్సిన స‌మ‌యంలో సూర్య కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా సూప‌ర్ 8 కింద జింబాబ్వేతో జ‌రిగిన పోరులో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు బ్యాట‌ర్లు. తొలుత మైదానంలోకి దిగిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 256 ప‌రుగుల భారీ స్కోరును సాధించింది. స్కోర్ ప‌రంగా గ‌తంలో పొట్టి ప్ర‌పంచ క‌ప్ లో అత్య‌ధిక స్కోర్ సాధించింది. గ‌తంలో 220 ప‌రుగులు చేసింది ఇండియా. కానీ అదే రికార్డును బ్రేక్ చేసింది . గ్యాప్ త‌ర్వాత సంజూ శాంస‌న్ ను తీసుకుంది మేనేజ్మెంట్. బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. శాంస‌న్ 15 బంతులు ఎదుర్కొని 24 ర‌న్స్ చేశాడు.
ఇషాన్ కిష‌న్ , అభిషేక్ శ‌ర్మ దుమ్ము రేపాడు. జింబాబ్వే బౌల‌ర్ల‌ను చిత‌క‌బాదారు. మ్యాచ్ ప‌రంగా చూస్తే టోర్నీలో నిరాశ ప‌ర్చిన అభిషేక్ శ‌ర్మ ఈ మ్యాచ్ లో స‌హ‌జ సిద్ద‌మైన ఆట‌తో ఆక‌ట్టుకున్నాడు. 55 ర‌న్స్ చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ 33 ప‌రుగులు చేస్తే తిల‌క్ వ‌ర్మ 44 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా సూప‌ర్ షో చేశాడు. హాఫ్ సెంచ‌రీతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో పొట్టి ప్ర‌పంచ క‌ప్ లో భారీ స్కోరును సాధించింది. అభిషేక్ శ‌ర్మ‌కు తోడుగా మైదానంలోకి దిగిన శాంస‌న్ త‌న‌దైన స్టైల్ లో ఆడాడు. ఎదుర్కొన్న రెండో బంతినే సిక్స‌ర్ బాదాడు. అనంత‌రం మ‌పోస ఓవ‌ర్ లో ఫోర్లు కొట్టాడు. ఆ త‌ర్వాత సిక్స్ కొట్ట‌బోయి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిష‌న్ 38 ప‌రుగులు చేశాడు.
.
The post చెల‌రేగిన బ్యాట‌ర్లు భార‌త్ భారీ స్కోరు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానంజ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి జ‌నాభా గురించి ప్ర‌స్తావించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని స్ప‌ష్టం చేశారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి

Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్షMinister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష

    మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు

Punjab Ex DGP: మాజీ డీజీపీ కొడుకు అనుమానాస్పద మృతి కేసులో భయానక ట్విస్ట్‌Punjab Ex DGP: మాజీ డీజీపీ కొడుకు అనుమానాస్పద మృతి కేసులో భయానక ట్విస్ట్‌

      పంజాబ్ మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్‌ వెలుగు చూసింది. తన భార్యతో… తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా