hyderabadupdates.com Gallery చెల‌రేగిన సంజు శాంస‌న్ త‌ల‌వంచిన ముంబై ఇండియ‌న్స్

చెల‌రేగిన సంజు శాంస‌న్ త‌ల‌వంచిన ముంబై ఇండియ‌న్స్

చెల‌రేగిన సంజు శాంస‌న్ త‌ల‌వంచిన ముంబై ఇండియ‌న్స్ post thumbnail image

ముంబై : ఐపీఎల్ 2026లో స్వంత గ‌డ్డపై ఘోర‌మైన ఓట‌మిని చ‌వి చూసింది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్. లీగ్ మ్యాచ్ లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో ఆది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది. క‌లిసిక‌ట్టుగా ఆడి గెలుపు బాట ప‌ట్టింది. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణ‌యం త‌ప్ప‌ని తేలి పోయింది. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు సీఎస్కే ఆట‌గాళ్లు. ఇదిలా ఉండ‌గా ఒక‌వేళ తాను గ‌నుక టాస్ గెలిచి ఉండి ఉంటే ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాడినంటూ పేర్కొన్నాడు కెప్ట‌న్ గైక్వాడ్.
మ్యాచ్ లో భాగంగా మైదానంలోకి దిగిన చెన్నై ఆట‌గాళ్లు మొద‌టి నుంచి దూకుడుగానే ఆడారు. ఫామ్ లోకి వ‌చ్చాడ‌ని అనుకుంటున్న త‌రుణంలోనే మ‌రోసారి కెప్టెన్ రుతురాజ్ నిరాశ ప‌రిచాడు. ఆ త‌ర్వాత స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సైతం స్పీడ్ గా ప‌రుగులు చేసే ప‌నిలో వికెట్ పారేసుకున్నాడు. శివ‌మ్ దూబేను శాంట్న‌ర్ తెలివైన బంతికి పెవిలియ‌న్ పంపాడు. కానీ మ‌రో వైపు యుద్దంలో సైనికుడి లాగా పోరాడాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను కేవ‌లం 54 బంతులు మాత్ర‌మే ఆడాడు. చిర‌స్మ‌ర‌ణ‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 10 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఉన్నాయి. 101 ప‌రుగులు చేసి చివ‌రి దాకా ఉన్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో చెన్నై 207 ప‌రుగులు చేసింది. అనంత‌రం 208 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ లో సూర్య‌, తిల‌క్ త‌ప్ప ఏ ఒక్క‌రూ డ‌బుల్ డిజిట్ స్కోర్ చేయ‌లేదు. అఖిల్ హుస్సేన్ బౌలింగ్ దెబ్బ‌కు విల విల లాడారు బ్యాట‌ర్లు. దీంతో 104 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు. 103 ప‌రుగుల భారీ తేడాతో అద్భుత గెలుపును స్వంతం చేసుకుంది సీఎస్కే.
The post చెల‌రేగిన సంజు శాంస‌న్ త‌ల‌వంచిన ముంబై ఇండియ‌న్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ జోష్ ప‌వ‌న్ ఖుష్ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ జోష్ ప‌వ‌న్ ఖుష్

హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు, తెలంగాణ‌కు చెందిన హ‌రీష్ శంక‌ర్ తీసిన తాజా చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. ఇందులో కీ రోల్ పోషించాడు ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . త‌న‌తో పాటు అందాల భామ‌లు

దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలుదేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలు

తిరుమల : భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని.. వారి నమ్మకాన్ని కాపాడేలా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని

KTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లుKTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లు

  ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని దానం నాగేందర్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ ను నిలదీశారు.