hyderabadupdates.com Gallery చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్ post thumbnail image

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా గురువారం ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన 2వ‌వ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు భారీ స్కోరును న‌మోదు చేసింది. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ఆట ఆరంభం నుంచే దాడి చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను కేవ‌లం 42 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 89 కీల‌క‌మైన ప‌రుగులు చేశాడు. భారీ స్కోరులో ముఖ్య భూమిక పోషించాడు. ఇందులో 8 ఫోర్లు 7 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. త‌ను 9 ప‌రుగులు చేశాడు.
అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన ఇషాన్ కిష‌న్ 18 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 39 ర‌న్స్ కొట్టాడు. ఆ త‌ర్వాత శివమ్ దూబే శివాలెత్తాడు. త‌ను 25 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 4 సిక్సులు బాదాడు . 43 ప‌రుగులు చేశాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ 11 ర‌న్స్ చేయ‌గా హార్దిక్ పాండ్యా చుక్క‌లు చూపించాడు. త‌ను 3 ఫోర్లు 2 సిక్సుల‌తో 26 ర‌న్స్ చేస్తే , తిల‌క్ వ‌ర్మ కేవలం 7 బంతులు ఎదుర్కొని 3 భారీ సిక్స్ ల‌తో 27 ప‌రుగులు చేశాడు. దీంతో ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టు ముందు 254 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముందు ఉంచింది టీం ఇండియా. ఇక పొట్టి క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టు అత్య‌ధిక స్కోర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.
The post చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంక్రాంతి వేళ ప‌వ‌ర్ స్టార్ తో మరో మూవీసంక్రాంతి వేళ ప‌వ‌ర్ స్టార్ తో మరో మూవీ

హైద‌రాబాద్ : మ‌రోసారి క‌లిసి సినిమా చేయ‌నున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు పీపుల్స్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వ ప్ర‌సాద్. ఆయ‌న తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ తో క‌లిసి రాజా సాబ్ తీశారు. అది సంక్రాంతి

పేద బ్రాహ్మ‌ణుల కోసం ‘గరుడ’ ప‌థ‌కంపేద బ్రాహ్మ‌ణుల కోసం ‘గరుడ’ ప‌థ‌కం

అమ‌రావ‌తి : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఖుష్ క‌బ‌ర్ చెప్పింది ఏపీ స‌ర్కార్. పేద బ్రాహ్మణ కుటుంబాల కోసం త్వరలో గరుడ పథకాన్ని ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చంద్రబాబు నాయుడు. మరణించిన పేద బ్రాహ్మణ కుటుంబాలకు తక్షణమే రూ. 10,000 సహాయం

నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డిందినా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్బంగా సింగ‌రేణి టెండ‌ర్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న వ‌ల్ల‌నే నైనీ