hyderabadupdates.com movies జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో మొదలైంది ఈ డిబేట్. ఏడాది కాలంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వాదనలు ప్రతివాదనలు ఎన్నో జరిగాయి. ఐతే దీనిపై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు లడ్డులో జంతు కొవ్వులు కలిసినట్లు స్పష్టమైన ఆధారాలు లేవంటూనే.. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమని.. అసలది నెయ్యే కాదని తేల్చాయి.

కానీ వైసీపీ మాత్రం అసలు విషయాన్ని పక్కన పెట్టి.. జంతుకొవ్వులు లేవనే విషయాన్నే పట్టుకుని ఎదురుదాడి చేస్తున్నాయి. దీనికి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు, పవన్ స్వయంగా దీటుగా బదులిచ్చారు. ఐతే ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ మీడియా స్థాయికి వెళ్లింది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డు ఇష్యూను టేకప్ చేశారు. తాజా చర్చలో లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆయన జగన్ అండ్ కోను కడిగి పారేశారు.

లడ్డు కల్తీ జరిగిందని నివేదికలు వందశాతం తేల్చాయని.. అసలది నెయ్యే కాదని.. కెమికల్స్ మిశ్రమం అంటూ వివరాలు చదివిన అర్నాబ్.. ఇలా అడ్డంగా దొరికాక కూడా ఎదురు దాడి ఏంటని ప్రశ్నించాడు. 300 ఏళ్ల నుంచి తిరుమల లడ్డును హిందూ భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్నారని.. ఉత్తరాదిన కూడా ఈ లడ్డును అందుకుంటే అదొక ఆశీర్వాదం అనుకుంటారని..

అలాంటి ప్రసాదాన్ని 2019-24 మధ్య కల్తీ చేసిన వైసీపీ ప్రభుత్వం మహా పాపం చేసిందని అర్నాబ్ అన్నారు. క్రిస్టియన్ల విషయంలో ఇలా సెంటిమెంట్లతో మీరు ఆడుకోగలరా అని జగన్‌ను ప్రశ్నించిన అర్నాబ్.. చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూ మీద జరిగిన చర్చలోనూ వైసీపీ ప్రతినిధులను ఉతికి ఆరేశాడు అర్నాబ్.

Related Post

ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?

అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం

సలహాదారు పదవి వద్దనుకున్న మంతెనసలహాదారు పదవి వద్దనుకున్న మంతెన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర యోగా, నేచురోపతి విభాగం ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ నియామకం క్యాబినెట్ హోదాతో కూడిన పదవి కావడంతో జీతభత్యాలు,

బ్రో 2……అవసరమా అధ్యక్ష్యా !బ్రో 2……అవసరమా అధ్యక్ష్యా !

సీక్వెల్స్ కి క్రేజ్ ఉంటుంది. మొదటి భాగాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడే వీటిని తీస్తే అందం చందం. అంతే తప్ప ప్రతిదానికి పార్ట్ 2 తీయాలని పరుగులు పెట్టకూడదు. ఈ మధ్య అభిమానులు ఎవరైనా దర్శక నిర్మాతలను కలిసినప్పుడు ఫలానా సినిమాకు