hyderabadupdates.com movies జగన్ పరామర్శలు.. సైతాన్ సైన్యం కోసమైనా?

జగన్ పరామర్శలు.. సైతాన్ సైన్యం కోసమైనా?

జగన్‌కు బలప్రదర్శనల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. జగన్ వెనుక సైతాన్ సైన్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సైన్యానికి లేదా ఆయన పార్టీ క్యాడర్‌కు ఇబ్బంది వస్తే తప్ప జగన్ బయటకు రారని ఆమె ఆరోపించారు.

రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం షర్మిలా పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కల్తీ పాల ఘటనలో బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం దారుణమని అన్నారు.

ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 11 ఏళ్లుగా అక్రమంగా డైరీ సంస్థ నడిచిన వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి కూడా బాధ్యతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. లైసెన్స్ లేకుండా 11 సంవత్సరాలుగా పాలు అమ్ముతున్నా ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు చేయకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.

రాష్ట్రంలో ప్రతిదీ కల్తీగా మారిపోయిందని షర్మిలా మండిపడ్డారు. పాలు, నెయ్యి, మద్యం, గుడ్లు, చికెన్ వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోందని పేర్కొన్నారు. వరలక్ష్మి మిల్క్ వెండర్ 11 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా పాలు అమ్ముతున్నాడని, అయినా ఎటువంటి తనిఖీలు జరగలేదని చెప్పారు.

పాలలో ఇథిలిన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర రసాయనాలు కలవడంతో 11 మంది మరణించడం తీవ్ర విషాదమని అన్నారు. ప్రస్తుతం మరో 9 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని, కొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఈ ఘటన తర్వాత నాలుగు రోజులు తనిఖీలు చేస్తున్నట్టు హడావిడి చేసి మళ్లీ యథావిధిగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేస్తే ఈ ఘటన జరిగేదే కాదని అన్నారు. అన్యం పుణ్యం ఎరగని సాధారణ ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Related Post

త్రివిక్రమ్ ఒరలో అసలు కత్తి ఎవరుత్రివిక్రమ్ ఒరలో అసలు కత్తి ఎవరు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. వెంకటేష్ తో సైలెంట్ గా ఆదర్శ కుటుంబం ఏకె 47 షూటింగ్ చేస్తుండగా ఇప్పుడు మరోసారి ఎందుకు హాట్ టాపిక్ అయ్యారనే సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. అల్లు అర్జున్ ముందు ఓకే

తాట తీస్తాం.. స్మగ్లర్లకు పవన్ మాస్ వార్నింగ్తాట తీస్తాం.. స్మగ్లర్లకు పవన్ మాస్ వార్నింగ్

ఎర్రచందనం స్మగ్లర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీశాఖ ఎర్రచందనం గోడౌన్ ను ఈరోజు ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న 8 గోడౌన్లో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకున్నారు.

అల్లు అర్జున్ తో కంటెంట్ ఉన్న నటుడు?అల్లు అర్జున్ తో కంటెంట్ ఉన్న నటుడు?

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ AA22పై బజ్ మాములుగా లేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో స్పీడ్ పెంచుతున్నారు. ప్రస్తుతం ముంబై పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న