hyderabadupdates.com movies జగన్… వాలంటీర్ల ఊసేది..?

జగన్… వాలంటీర్ల ఊసేది..?

పార్టీ అధినేత మనసులో ఉన్న మాటే.. నాయకులూ చెబుతున్నారా..? వైసీపీలో వలంటీర్ల విషయంలో తమ వైఖరిని తేల్చేసిందా..? ఈ రోజు వైసీపీ అధినేత విలేకరుల సమావేశంలో జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తమ హయాంలో ఒక్క నోటిఫికేషన్ తోనే 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్పారు. అయితే ఆయన వలంటీర్ల విషయం కనీసం ఊసు ఎత్తకపోవడం గమనార్హం.

వలంటీర్ల అంశంపై ఇటీవల జగన్ కు సన్నిహితుడు వైసీపీ నేత బాల నాగిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థను నమ్ముకొని తాము ప్రజలకు న్యాయం చేయలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థ కారణంగా ప్రజలు, నాయకుల మధ్య దూరం పెరిగిందన్నారు. వలంటరీ వ్యవస్థే తమ కొంపముంచిందని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తేల్చిచెప్పేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల వ్యవస్థ గొప్పగా పనిచేసిందని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు వారి ద్వారా చేరాయని అంటారు. అయితే గత ఎన్నికల్లో వలంటీర్లు పనిచేయకుండా న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. ఆ తర్వాత కూటమి గెలిచింది. వలంటీర్ల ఊసే లేకుండా పోయింది.

వలంటీర్లు లేకుండా ప్రతి నెలా పింఛన్లను నేరుగా లబ్ఢిదారుల ఇంటికి చేరవేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు నిరూపించారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వైసీపీ వలంటీర్ల ఊసే ఎత్తడం లేదు. అదే బాటలో జగన్ఈ రోజు వారి మాట ఎత్తకుండానే గ్రామ సచివాలయాల గురించి చెప్పారు. తమ హయాంలో  

15వేల గ్రామ సచివాలయాలు నిర్మించాం అన్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులను పెట్టడం ఒక రికార్డు అని ప్రకటించారు. ఒక్క నోటిఫికేషన్ తోనే 1.34లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి సచివాలయంలో వీఆర్వో, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు. భూసర్వేలో 40వేల మంది సర్వేయర్లు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారంటూ చెప్పారు కానీ వలంటీర్ల గురించి ఏమీ మాట్లాడలేదు. అంటే వలంటీర్లను జగన్ మరిచిపోయినట్లేనా.. అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related Post

Rukmini Vasanth Joins Yash’s ‘Toxic’, Poster Unveils Her Role as MellisaRukmini Vasanth Joins Yash’s ‘Toxic’, Poster Unveils Her Role as Mellisa

The makers of Rocking Star Yash’s much-awaited film Toxic: A Fairytale for Grown-Ups have unveiled a major update that has heightened excitement among fans. Actress Rukmini Vasanth has been officially

కేసీఆర్ వద్దకు రేవంత్, నిలబడని కేటీఆర్!కేసీఆర్ వద్దకు రేవంత్, నిలబడని కేటీఆర్!

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలను పక్కనపెట్టి ప్రత్యర్థులను సైతం గౌరవించాల్సిన పరిస్థితులుంటాయి. పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదో…ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే అసలైన రాజకీయ నాయకుడు. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందినాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా నటించిన జరీనా వహాబ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్టవుతున్నారు. ఇప్పటిదాకా మదర్ క్యారెక్టర్స్ లో రిపీట్ ఆర్టిస్టులను చూసి