hyderabadupdates.com movies జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో ఇది రివర్స్ లో ఉంది. జనవరి 9 విడుదల కానున్న విజయ్ జన నాయకుడుకి పోటీగా శివ కార్తికేయన్ పరాశక్తి వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు అనౌన్స్ చేసిన డేట్ జనవరి 14. దానికి అనుగుణంగానే ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడీ పరాశక్తి తేదీని మార్చి జనవరి 10కే తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోందట. ఆ మేరకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చి చెన్నైలోని పంపిణీదారులతో ఈ మార్పు గురించి నిర్మాతలు చర్చలు చేస్తున్నట్టు సమాచారం.

ఇక్కడ ఆలోచించాల్సిన కోణాలు చాలా ఉన్నాయి. మొదటిది రాజకీయంగా విజయ్ కు చెక్ పెట్టేందుకు చూస్తున్న అధికార పార్టీ వర్గాలు తమ పరిధిలోనే ఉన్న పరాశక్తి డిస్ట్రిబ్యూషన్ ని ప్రేరేపించడం ద్వారా డేట్ మార్పించారని ఒక వర్షన్ వినిపిస్తోంది. రాజకీయాలకు ముందు ఎంత విజయ్ చివరి సినిమా అయినప్పటికీ పరాశక్తిని తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం కాన్సెప్ట్ తీసుకుని దర్శకురాలు సుధా కొంగర చాలా ఇంటెన్స్ గా తీశారట. కంటెంట్ కనక జనాలకు కనెక్ట్ అయితే వెల్లువలా థియేటర్లకు వస్తారనే నమ్మకం టీమ్ లో ఉంది.

ఇటువైపు జన నాయకుడుది రెగ్యులర్ స్టోరీనే. భగవంత్ కేసరి పాయింట్ తీసుకుని దానికే దర్శకుడు హెచ్ వినోత్ చాలా మార్పులు తీసుకుని కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించారట. దీనికి అయిదు రోజుల గ్యాప్ ఇవ్వడం వల్ల భారీ వసూళ్లు విజయ్ ఖాతాలో వెళ్లిపోయే రిస్క్ ఉంది కాబట్టి దాన్ని పంచుకునే ఉద్దేశంతో పరాశక్తిని రంగంలోకి దింపుతున్నారని విజయ్ అభిమానులు కస్సుమంటున్నారు. తెలుగులో చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టితో కాంపిటీషన్ ఉంది కాబట్టి డబ్బింగ్ వెర్షన్ ముందుగా వస్తే ఓపెనింగ్స్ పరంగా హెల్ప్ అవుతుందనేది పరాశక్తి ఆలోచన కావొచ్చు.

Related Post

Kris Jenner Opens Up About Staying Connected to Her Kids’ Exes: ‘Love Doesn’t Turn Off’Kris Jenner Opens Up About Staying Connected to Her Kids’ Exes: ‘Love Doesn’t Turn Off’

Kris Jenner has opened up about why she continues to maintain warm relationships with her children’s former partners, even when their breakups were public and sometimes complicated. Speaking on Jay

రైతులకు బాబుకు మధ్య గ్యాప్ చెరిగిపోతుందిరైతులకు బాబుకు మధ్య గ్యాప్ చెరిగిపోతుంది

రైతులకు చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం రాజకీయాల్లో ఉంది. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రాధాన్యం సీఎం చంద్రబాబు అన్నదాతలకు ఇవ్వరని, వారి కష్టాలు పట్టించుకోరని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తారు. రైతు బాంధవులు అంటే వైఎస్ కుటుంబమేనని కూడా చెబుతుంటారు.