hyderabadupdates.com movies జనార్ధన… రౌడీ కాదు రాక్షసుడుని మించి

జనార్ధన… రౌడీ కాదు రాక్షసుడుని మించి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈసారి రౌడీ జనార్ధనగా రాబోతున్నాడు. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన ఈ వయొలెంట్ డ్రామాని ఎస్విసి బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2026 డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ టీజర్ ఇవాళ అభిమానుల భారీ కోలాహలం మధ్య హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఏడాదికి ముందే ఇలా ప్లానింగ్ చేయడం చూస్తే ప్రమోషన్ పరంగా పెద్ద స్కెచ్చే కనిపిస్తోంది. రెండు నిమిషాల వీడియోలో క్యారెక్టర్ ని పరిచయం చేసిన దర్శకుడు ఎక్కువ విజువల్స్ రివీల్ చేయలేదు. షూటింగ్ ఇంకా కీలక దశకు చేరుకోవాల్సి ఉంది.

అనగనగా కళింగపట్నం అనే ఊరు. మొత్తం రౌడీలతో రాక్షస రాజ్యం ఏలుతూ ఉంటుంది. అయితే వీళ్ళెవరూ రౌడీలు కాదని ఇంటి పేరునే అలా మార్చుకున్న జనార్ధన (విజయ్ దేవరకొండ) అనే యువకుడు ఊచకోత అంటే ఏమిటో రక్తం సాక్షిగా అందరికీ పరిచయం చేస్తాడు. అడ్డొచ్చిన వాళ్ళను తెగ నరికేందుకు వెనుకాడని అతని మనస్తత్వం వెనుక ఎవరికీ తెలియని ఒక చేదు బాల్యం ఉంటుంది. పసితనంలో తను చూసిన చీకటి నుంచి పుట్టిన ఉక్రోషమే రాక్షసుడిగా మారుస్తుంది. అసలు రౌడీ జనార్ధన అంటే ఎవరు, ఎందుకు ఇలాంటి విధ్వంసానికి పాల్పడ్డాడనేది తెలియాలంటే ఇంకో సంవత్సరం దాకా ఎదురు చూడాలి.

విజువల్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. క్రిస్టో క్సేవియర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంటెంట్ లో ఉన్న మూడ్ ని ప్రతిబింబించేలా ఉంది. హీరోయిన్ కీర్తి సురేష్ తో సహా ఎవరినీ రివీల్ చేయలేదు. కింగ్డమ్ తో విఫలమైనా మరోసారి అదే జానర్ తో తిరిగి హిట్టు కొట్టేందుకు విజయ్ దేవరకొండ బాగానే కష్టపడుతున్నాడు. దేహాన్ని మలుచుకున్న విధానం అదే సూచిస్తోంది. కొనతిరిగిన మీసకట్టు, విభిన్నంగా అనిపిస్తున్న స్లాంగ్ మొత్తానికి అభిమానులు కోరుకున్నట్టే ఉన్నాడు. అయితే సభ్యతగా అనిపించని ల….కొడుకు అనే పదం ఇందులో కూడా వాడేశారు. దీనికి సోషల్ మీడియా నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Related Post

ఏపీలో ఎన్నాళ్లీ లడ్డూ రాజకీయం..!ఏపీలో ఎన్నాళ్లీ లడ్డూ రాజకీయం..!

ఏపీలో తెర మీదకు వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాజకీయం మరింత ముదురుతోంది. ఇవి ఎప్పటి వరకు సాగుతాయి? ఎంత వరకు కొనసాగుతాయి? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే తిరుమల శ్రీవారి

Aishwarya Rajesh: My long wait has finally ended with Sankranthiki VasthunamAishwarya Rajesh: My long wait has finally ended with Sankranthiki Vasthunam

Actress Aishwarya Rajesh scored a massive blockbuster with Sankranthiki Vasthunam, headlined by Victory Venkatesh. In a recent interaction with the media, the actress spoke about how special the film’s success

ముంచెత్తుతున్న మహేష్-తారక్ వీడియోలుముంచెత్తుతున్న మహేష్-తారక్ వీడియోలు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక ఒక వ్యక్తి అందుబాటులో లేకపోయినా.. కేవలం వాళ్ల ఫొటోలను వాడి వాళ్లు నటిస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు వీడియోలు, ఆడియోలు రెడీ చేసేస్తున్నారు. క్రమంగా వీటిలో పర్ఫెక్షన్ కూడా కనిపిస్తోంది. దీంతో ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అని కనిపెట్టడం