hyderabadupdates.com Gallery ‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం

‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం

‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం post thumbnail image

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కీల‌క‌మైన న‌టుడిగా ఉన్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఆపై టీవీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఏడాది 2026లో జ‌రిగే శాస‌న స‌భ ఎన్నక‌ల‌లో ఒంట‌రిగానే పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించాడు. అంతే కాదు త‌ను సినిమా రంగం నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. తాను న‌టించిన జ‌న నాయ‌గ‌న్ మూవీ ఆఖ‌రి సినిమా అని స్ప‌ష్టం చేశాడు. దీంతో తాను పూర్తిగా సీరియ‌స్ గా పాలిటిక్స్ లో ఉంటాన‌ని పేర్కొన్నాడు. తాజాగా జాతీయ ఛాన‌ల్ ఎన్డీటీవీతో చిట్ చాట్ చేశాడు ద‌ళ‌ప‌తి విజ‌య్. ఇదిలా ఉండ‌గా జ‌న‌వ‌రి 9వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల కావాల్సి ఉంది. అయితే త‌మిళ‌నాడుకు చెందిన సెన్సార్ బోర్డు అభ్యంత‌రం తెలిపింది. దీనిని స‌వాల్ చేస్తూ హైకోర్టును, చివ‌ర‌కు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం ఎప్పుడు విడుద‌ల అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. భారీ బ‌డ్జెట్ తో జ‌న నాయ‌గ‌న్ ను నిర్మించారు నిర్మాత‌.
సినీ నిర్మాత ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశాడు ద‌ళ‌ప‌తి విజ‌య్. ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ టాప్ హీరో బాద్ షా షారుక్ ఖాన్ ను రోల్ మోడ‌ల్ అని ప్ర‌శంసించాడు. బిగిల్ , మెర్సల్ స్టార్ తన రాజకీయ ప్రవేశం వల్ల సినిమాల నుండి శాశ్వత బహిష్కరణకు దారితీసిందని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. జన నాయగన్ ఎదుర్కొంటున్న రాజకీయ ప్రేరేపిత సమస్యల గురించి విజయ్ తలపతి విజయ్ విచారం వ్యక్తం చేశారు. తన నిర్మాత పట్ల బాధగా ఉందని, ఎందుకంటే తన రాజకీయ ప్రవేశం కారణంగా ఆ ప్రాజెక్ట్ ఇబ్బందులు పడుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అడ్డంకులను ఊహించారు, వ్యక్తిగత ప్రభావాలకు మానసికంగా సిద్ధమయ్యారు, కానీ నిర్మాతకు కలిగిన కష్టం పట్ల బాధ పడ్డారు. కాగా జన నాయగన్ బడ్జెట్ సుమారు రూ. 350 కోట్లు ఉంద‌ని అంచ‌నా. ఇందులో విజయ్ పారితోషికం ఒక్కటే రూ. 250 కోట్లు అని టాక్.
The post ‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఉగ్ర‌వాదంపై ఉక్కుపాదం మోపుతాం : అమిత్ షాఉగ్ర‌వాదంపై ఉక్కుపాదం మోపుతాం : అమిత్ షా

ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో ఉగ్ర‌వాదాన్ని లేకుండా చేస్తామ‌న్నారు. ప్ర‌త్యేకించి ఈ ఏడాది లోపు ఏ ఒక్క మావోయిస్టు ఇండియాలో ఉండ‌ర‌ని ప్ర‌క‌టించారు. ఇందు కోసం భార‌తీయ బ‌ల‌గాలు

జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలిజీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి

అమ‌రావ‌తి :తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్

Delhi Airport: దిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సు దగ్ధంDelhi Airport: దిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సు దగ్ధం

Delhi Airport : దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi Airport) ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. ఎయిర్‌పోర్టులోని (Delhi Airport) మూడో టర్మినల్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్యాక్సీయింగ్‌ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత