hyderabadupdates.com Gallery జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు post thumbnail image

హైద‌రాబాద్ : జలమండలి లోని అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ-ఆఫీస్ ను అన్ని విభాగాలలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల కార్యాలయాల్లో సామర్థ్యం, పారదర్శకత, బాధ్యతతో పాటు సేవల ప్రమాణాలు మెరుగు పడనున్నాయని అయన అన్నారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి ఈ-ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి ఫైలు మాన్యువల్ గా స్వీకరించడం జరగదని ఈ-ఆఫీస్ ద్వారా పంపించాలని అధికారులతో అన్నారు.
ఈ-ఆఫీసులో స్కాన్ చేసి భద్రపరచడమే కాకుండా వివిధ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ ఆఫీసులో పొందుపరచడం జరుగుతుందని చెప్పారు ఎండీ అశోక్ రెడ్డి. సంబంధించిన అధికారి ఎవరైనా వారి విభాగపు ఫైల్స్ ఈ-ఆఫీసులో సరిచూసుకునే వెసులుబాటు ఉండడంతో పరిపాలన సులభతరం అవుతుందని అన్నారు. తొలుతగా ప్రధాన కార్యాలయంలో అన్ని కార్యకలాపాలను ఈ-ఆఫీస్ లో నిర్వహిస్తామని.. విడతల వారీగా అన్నీ డివిజన్ లలో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఎండీ వివరించారు.
ఈ ఆఫీస్ వ‌ల్ల కార్యనిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని, ఫైళ్ల ప్రాసెసింగ్ సమయం తగ్గుతుందని, రికార్డు నిర్వహణ మెరుగు పడుతుందన్నారు ఎండీ. భద్రమైన డిజిటల్ నిల్వతో పాటు ఆవరమైనప్పుడు సులభంగా తనిఖీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంద‌న్నారు. అంతే కాకుండా విభాగాల మధ్య సమన్వయం మెరుగు పడుతుందని పేర్కొన్నారు.
The post జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: నౌకాదళ కార్యకలాపాలకు సంపూర్ణ సహకారం – సీఎం చంద్రబాబుCM Chandrababu: నౌకాదళ కార్యకలాపాలకు సంపూర్ణ సహకారం – సీఎం చంద్రబాబు

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీప్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. విశాఖలో సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ భల్లా మర్యాద పూర్వకంగా కలిశారు.

Sathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడుSathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు

    సత్యసాయి గ్రామంలో జరుగుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్ కార్యక్రమానికి ఫిజీ అధ్యక్షుడు హాజరయ్యారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని 100 దేశాలు ఒక్కతాటిపైకి రావడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సేవ, మానవత్వం, ఐక్యతకు ఇది