hyderabadupdates.com movies జానర్ మారుతోంది… హిట్టొస్తుందా?

జానర్ మారుతోంది… హిట్టొస్తుందా?

కెరీర్ ఆరంభంలో చాలా వరకు సీరియస్ పాత్రలే చేశాడు శ్రీ విష్ణు. తనకు మంచి గుర్తింపు తెచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘మెంటల్ మదిలో’, ‘నీదీ నాదీ ఒకే కథ’ సీరియస్‌గానే సాగుతాయి. బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర వినోదాత్మక చిత్రాలే అయినా.. వాటిలోనూ శ్రీవిష్ణుది మాత్రం సీరియస్ యాక్టింగే. కానీ గత కొన్నేళ్లలో మాత్రం తన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.

సామజవరగమన, శ్వాగ్, సింగిల్ లాంటి చిత్రాల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్‌లో కనిపించాడు శ్రీ విష్ణు. ఈ క్రమంలోనే అతడికి ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్ కూడా వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో కామెడీ భలే చేస్తాడనే పేరున్న హీరోల్లో అతనొకడు. ఐతే తన కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’లో మాత్రం శ్రీ విష్ణు అనుకున్నంతగా నవ్వించలేకపోయాడు.

తన పెర్ఫామెన్స్ వరకు ఓకే అయినా.. వీక్ స్క్రిప్టు వల్ల సినిమా నిలబడలేదు. గత శుక్రవారం రిలీజైన ఈ చిత్రం.. వీకెండ్ వరకు ఓ మోస్తరుగా ఆడి, సోమవారానికి చల్లబడిపోయిన సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఐతే ‘విష్ణు విన్యాసం’ వచ్చిన వారానికే శ్రీ విష్ణు చిత్రం ఇంకోటి థియేటర్లలోకి దిగుతోంది. అదే.. మృత్యుంజయ్. సుకుమార్ శిష్యుడైన హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇంతకుముందు కిరణ్ ‘మీకు మీరే మాకు మేమే’ అనే సినిమా తీశాడు. అది ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో లాంటి థ్రిల్లర్ చిత్రాల రచనలో భాగమైన కిరణ్.. తన స్ట్రెంత్ ఉన్న జానర్లోనే సినిమా తీశాడు. ఇది శ్రీ విష్ణు రీసెంట్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన సినిమా. తన మార్కు కామెడీ ఏమీ ఇందులో ఉండదు. కెరీర్ మొదట్లో చేసినట్లు పూర్తి సీరియస్ క్యారెక్టర్ చేసినట్లున్నాడు శ్రీ విష్ణు. తన లుక్ కూడా పాత రోజులను గుర్తుకు తెస్తోంది.

టీజర్, ట్రైలర్ చూస్తే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో, ఉత్కంఠభరితంగా సాగే సినిమాలా కనిపిస్తోంది. కాకపోతే కామెడీతో అభిమానులను సంపాదించుకున్న శ్రీ విష్ణు.. ఈ సీరియస్ మూవీతో వారిని థియేటర్లకు రప్పించగలడా అన్నది చూడాలి. సంక్రాంతి తర్వాత మొదలైన బాక్సాఫీస్ స్లంప్‌ను ‘విష్ణు విన్యాసం’తో అధిగమించలేకపోయిన శ్రీ విష్ణు.. ‘మృత్యుంజయ్’తో అయినా దాటుతాడేమో చూడాలి.

Related Post

మెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్మెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్

విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. భారత ఏఐ రంగంలో ఇది ఒక చరిత్రాత్మక మలుపు అని, ఏఐ రంగానికి ప్రపంచ కేంద్రంగా భారత్ మారబోతోందని ఏఐ

మోడీ ప‌ర్య‌ట‌న‌: వైసీపీ మ‌రో యాగీ.. కేంద్రం ఎంట్రీ!మోడీ ప‌ర్య‌ట‌న‌: వైసీపీ మ‌రో యాగీ.. కేంద్రం ఎంట్రీ!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలులో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అదేస‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియా స‌హా ప్ర‌ధాన మీడియాలో వ‌చ్చిన కొన్ని వార్త‌ల‌పై వెంట‌నే కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు కూడా