hyderabadupdates.com movies జాన్వీ కపూర్ సినిమాకు సూపర్ టాక్

జాన్వీ కపూర్ సినిమాకు సూపర్ టాక్

మనకు దేవర,పెద్ది హీరోయిన్ గా దగ్గరయ్యింది కానీ బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కు ఎదురీత తప్పడం లేదు. వరస ఫ్లాపులతో కెరీర్ ముందు, వెనక్కు జరుగుతోంది. టయర్ 2 హీరోలతో చేసినవి ఎక్కువ శాతం డిజాస్టర్లు కావడంతో స్టార్లు దగ్గరికి తీసుకోవడం లేదు. తండ్రి బోనీ కపూర్ కూతురిని శ్రీదేవి అంత స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. కానీ హిందీలో ఫలితాలు రివర్స్ లో వస్తున్నాయి. నిజానికి పెద్దికి చాలా ఎక్కువ రెమ్యునరేషన్ ఇమ్మని బోనీని అడిగితే నిర్మాత ముందు వద్దనుకున్నారు. కానీ బుచ్చిబాబు కథ విపరీతంగా నచ్చేసిన జాన్వీ తండ్రిని ఒప్పించి ఓకే చేయించుకుందనే టాక్ ముంబై వర్గాల్లో ఉంది.

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ నటించిన ఒక సినిమాకు సూపర్ టాక్ వచ్చింది. అదే హోమ్ బౌండ్. కొన్ని వారాల క్రితం థియేటర్ రిలీజ్ జరుపుకున్న ఈ ఎమోషనల్ మూవీ కమర్షియల్ గా భారీ వసూళ్లు తేలేదు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఆదరణకు నోచుకుంది. ఆస్కార్ నామినేషన్ల అర్హత లిస్టులో చోటు దక్కించుకోవడంతో సినీ ప్రియుల దృష్టిలో పడింది. ఇందులో ఇద్దరు హీరోలు. ఇషాన్ కట్టర్, విశాల్ జేత్వా. మసాన్ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఇచ్చిన నీరజ్ మైవాన్ దర్శకుడు. నిర్మాత కరణ్ జోహార్. నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దీనికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. రివ్యూలు, సోషల్ మీడియా టాక్స్ ఫుల్ పాజిటివ్ గా ఉన్నాయి.

జీవితంలో గొప్ప లక్ష్యాలు పెట్టుకున్న ఇద్దరు యువకులు వాటిని నెరవేర్చుకోవడం కోసం నగరానికి వస్తారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వీళ్లకు కరోనా సమయం కఠిన పరీక్ష పెడుతుంది. స్వంత ఊరికి తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో విపరీతమైన ఇబ్బందులు, అవమానాలు ఎదురుకుంటారు. చివరికి గమ్యం అందుకున్నారా లేదానేది స్టోరీ. జాన్వీ కపూర్ పాత్ర నిడివి తక్కువే అయినా మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు చాలా ఉన్నాయి. ఎంటర్ టైన్మెంట్  కోరుకునే వారికి ఇది ఛాయస్ కాదు. మూవీ లవర్స్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన రికమండేషన్ హోమ్ బౌండ్.

Related Post

పెట్టుబ‌డి దారుల‌కు బాబు బిగ్ హామీ.. ఏంటీ `ఎస్క్రో` ఖాతా?పెట్టుబ‌డి దారుల‌కు బాబు బిగ్ హామీ.. ఏంటీ `ఎస్క్రో` ఖాతా?

సీఎం చంద్ర‌బాబు తాజాగా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేవారికి భారీ హామీ ప్ర‌క‌టించారు. విశాఖ‌లో జ‌రుగుతున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సులో తొలిరోజు శుక్ర‌వారం ఆయ‌న పెట్టుబ‌డి దారుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. 72 దేశాల నుంచి సుమారు 2500 మందికి పైగా ప్ర‌తినిధులు ఈ స‌ద‌స్సుకు