hyderabadupdates.com Gallery జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం

జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం

జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం post thumbnail image

విశాఖ‌పట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ కొణిద‌ల గురువారం విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. త‌న తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించ‌చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు వెల్ల‌డించారు. జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను ప్రారంభించారు.
జూపార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ని అడిగి తెలుసుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. జంతు శాలల్లో ఆహారం అందించేందుకు వెళ్లే సమయాల్లో జూ నిబంధనలు పాటించారు. కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనాన్నికూడా ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఎకో పార్క్ లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గం మధ్యలో మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జంతువుల సంర‌క్ష‌ణ అనేది ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త కావాల‌ని పిలుపునిచ్చారు. ఆయా సంస్థ‌లు సామాజిక బాధ్య‌త‌గా భావించాల‌ని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల.
The post జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kinjarapu Rammohan Naidu: దేశం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుKinjarapu Rammohan Naidu: దేశం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని.. అందుకు వనరుగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎస్.

Pregnant: కుమురం భీం జిల్లాలో నిండు గర్భిణి దారుణ హత్యPregnant: కుమురం భీం జిల్లాలో నిండు గర్భిణి దారుణ హత్య

    కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహేగాం మండలంలో దారుణం చోటు చేసుకుంది. గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ హత్య చేశాడు. గొడ్డలి, కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. సత్యనారాయణ కుమారుడు

ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌రాల వెల్లువఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌రాల వెల్లువ

ఆదిలాబాద్ జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు వ‌రాల జ‌ల్లులు కురిపించారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వ విద్యాలయం, నిర్మల్‌లో