hyderabadupdates.com Gallery జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి

జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి

జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి post thumbnail image

అమ‌రావ‌తి :తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌. దీనికోసం అటవీ శాఖ సిబ్బంది సమష్టిగా పని చేస్తూ ముందుకు కదలాల‌ని అన్నారు. 1052 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత రక్షణకు మడ అడవులు బలమైన గోడల్లాంటివి అని చెప్పారు. వీటిని పెంపొందించడంలో, రక్షించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో “మడ అడవుల పెంపుదల – వాటి నుంచి సుస్థిర ఆదాయం ” జాతీయ స్థాయి వర్క్ షాపు విజయవాడలో ప్రారంభం అయ్యింది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్ర‌సంగించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.
రాష్ట్రానికి తుపానుల ప్రభావం చాలా అధికం. దీనివల్ల ప్రతి ఏటా అపార నష్టం జరుగుతుందని అన్నారు డిప్యూటీ సీఎం. ముఖ్యంగా గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో తుపానుల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి మడ అడవులను సమృద్ధిగా పెంచడం అనేది కీలకం అన్నారు. మడ అడవుల పెంపకంలో జీవ వైవిధ్యాన్ని రక్షించాలని కోరారు ప‌వ‌న్ క‌ల్యాణ్. మడ అడవులను కొత్తగా పెంచడంతో పాటు, ఉన్న మడ అడవులను కాపాడు కోవడం అనేది ముఖ్య‌మ‌న్నారు. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతంలో సుమారుగా 700 హెక్టార్లలో మడ అడవులను పెంచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోను కొనసాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.
The post జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లుమ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

శ్రీ‌శైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామి-అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గనియా అధికారులను

Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్

    విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోన్నామని… ఈ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడి చర్చలు జరుగుతాయని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పారిశ్రామికవేత్తలతో పాటు పాలసీ మేకర్లు హాజరై రాబోయే