ఏపీ అధికార కూటమిని ముందుండి నడిపిస్తున్న టీడీపీ.. తెలంగాణ విషయంలో కీలక, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతంలో అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నుంచి తక్కువగా దూరం ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి, గత ఏడాది, ఈ ఏడాది కూడా.. తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీ ఏ ఎన్నికలోను పోటీకి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.
దీంతో స్థానికంగా ఉన్న తెలంగాణ టీడీపీ నాయకులు జూబ్లీహిల్స్‌పై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఒకప్పుడు జూబ్లీహిల్స్ గుర్తింపు పొందింది. పైగా, సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా కూడా దీనికి పేరుంది. కాబట్టి, టీడీపీ ఇక్కడ పోటీ పడ్డా.. పార్టీ గెలుపు లేదా ఓటములు ఏ విధంగా ఉన్నా.. పుంజుకోవడానికి, తన అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే అనుకున్నారు. గత నెలలో చంద్రబాబు హైదరాబాదులో పర్యటించినప్పుడు కూడా ఇదే విషయం చర్చకు వచ్చింది. “ఎవరికీ మద్దతు ఇవ్వడం ఎందుకు? మనమే పోటీ చేద్దాం,” అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు.. అసలు ఎవరికీ మద్దతు ఇవ్వరాదని చంద్రబాబు నిర్ణయించారు. సహజంగా, ఈ నిర్ణయం బీజేపీని బాధించేది. ఎందుకంటే, ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాంటిది, తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ పోటీ చేయకపోయినా.. పొత్తు ధర్మాన్ని (ఏపీ, కేంద్రం) పాటిస్తూ తమకు మద్దతు ఇస్తారని బండి సంజయ్ వంటివారు ఏపీలో పర్యటించినప్పుడు పేర్కొన్నారు. వాస్తవానికి టీడీపీ నేతలూ అదే అనుకున్నారు.
కానీ అనూహ్యంగా చంద్రబాబు జూబ్లీహిల్స్‌లో ఎవరికీ మద్దతు ఇవ్వరని తేల్చి చెప్పారు. దీనికి కారణాలు ఏవైనా ఉన్నా.. బీజేపీ నాయకులు హర్ట్ అవడం ఖాయం. దీన్నిబట్టి, చంద్రబాబు నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. తమకు అన్యాయం చేయకూడదనే, ఆయన అండ ఉండే అవకాశం ఉందని కమల్ నాథులు లెక్కలు వేసుకున్నారు.
ఇక, జూబ్లీహిల్స్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 13న రానుంది. తద్వారా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో టీడీపీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో పెట్టకపోయినా.. ఆ పార్టీ మద్దతు కోసం వేచి ఉన్న కొన్ని పార్టీలను మాత్రం హర్ట్ చేసిందని చెప్పాలి.