hyderabadupdates.com Gallery జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌

జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌

జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌ post thumbnail image

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో షోరూం య‌జ‌మానులు స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఈ మేర‌కు గురువారం ఆయ‌న స్వ‌యంగా రంగంలోకి దిగారు. షో రూంల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అంతే కాకుండా న‌గ‌రంలో షాపుల‌తో పాటు వాణిజ్య స‌ముదాయాల్లో హైడ్రా క‌మిష‌న‌ర్ ముమ్మ‌రంగా త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే జూబ్లీహిల్స్ రోడ్డు నంబ‌రు 36లో ఉన్న నీరూస్ షోరూంను సంద‌ర్శించారు. య‌జ‌మాని నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మూడు సెల్లార్లు, నాలుగు అంత‌స్తుల‌కు తోడు పైన అనుమ‌తి లేని రూఫ్ షెడ్డు వేసి వ‌స్త్రాల‌తో నింపేయ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. రెండు అంత‌స్తుల్లో అమ్మ‌కాలు, పైన మూడు అంత‌స్తుల్లో వ‌స్త్రాల త‌యారీ, గోదాములా పెద్ద‌మొత్తంలో నిలువ‌లు ఉంచ‌డంప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
ఫైర్ ఎన్వోసీ లేకుండా షాపుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు క‌మిష‌న‌ర్ త‌నిఖీల్లో తేలింది. ఫైర్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌క పోవ‌డ‌మే కాకుండా.. ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్ (మంట‌ల‌ను ఆర్పేది) లు కూడా స‌రిగా లేక‌పోవ‌డాన్ని గ‌మ‌నించారు. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు పాటించ‌క పోవ‌డంతో సీజ్ చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. హైడ్రా, ఫైర్, జీహెచ్ ఎంసీ, విద్యుత్ శాఖ‌ల‌కు చెందిన అధికారులు ఈ త‌నిఖీల్లో ఉన్నారు. ఫైర్ అన్ సేఫ్ షాపుగా పేర్కంటూ బోర్డుల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా.. హైడ్రా ఫెన్సింగ్ వేసింది. విద్యుత్ అధికారులు ప‌వ‌ర్ స‌ప్లైను బంద్ చేశారు.
The post జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. త్యాగానికి మానవ రూపం పొట్టి శ్రీరాములు అన పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. వారి విగ్రహం ఏర్పాటు తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనిపేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు

Kiran Abbavaram’s Comedy Entertainer ‘K-Ramp’ Trailer Goes ViralKiran Abbavaram’s Comedy Entertainer ‘K-Ramp’ Trailer Goes Viral

Young Telugu actor Kiran Abbavaram is all set to charm audiences with his latest film, K-Ramp. The trailer for the full-fledged comedy entertainer was recently released and has received an

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దంవ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దం

ముంబై : కోట్లాది మంది భార‌తీయులు ఇవాళ ముంబై వేదిక‌గా జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వెస్టిండీస్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి భార‌త్ ను సెమీస్ చేర్చిన సంజూ శాంస‌న్ పై