hyderabadupdates.com movies టాక్సిక్ అభిమానులకో ఝలక్

టాక్సిక్ అభిమానులకో ఝలక్

మార్చి 19 దురంధర్ రివెంజ్ తో నువ్వా నేనానే రీతిలో పోటీ పడుతున్న టాక్సిక్ నుంచి ఇవాళ ఫస్ట్ సింగల్ వచ్చింది. మాములుగా లిరికల్ వీడియో అంటే విజువల్స్, మేకింగ్ షాట్స్ ఉంటాయి. కానీ అవేవి లేకుండా కేవలం కియారా అద్వానీ, యష్ సముద్రం ఒడ్డున కూచున్న ఒక స్టిల్ పెట్టేసి మమ అనిపించారు. విశాల్ మిశ్రా ట్యూన్ చేసిన ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కు రామజోగయ్య శాస్త్రి సంగీతం సమకూర్చారు.

తబాహి అంటూ హిందీ పదాన్నే హుక్ వర్డ్ గా పెట్టుకుని మిగిలింది ఆయా భాషలకు అనుగుణంగా సాహిత్యం రాయించారు. మెల్లగా ఎక్కేలా ఉన్నా ఈ పాటలో రిథమ్స్, విశాల్ గాత్రం బాగానే ఉన్నాయి. విడుదల కేవలం పదిహేడు రోజుల దూరంలో పెట్టుకుని ఇలా కంటెంట్ దాచడం పట్ల ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ అయితే ఈ పాట తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తవ్వలేదు. కానీ మ్యూజిక్ కంపెనీ ఒత్తిడి వల్ల కొంచెం హడావిడిగా విడుదల చేయాల్సి వచ్చిందట.  

లేదంటే నెక్స్ట్ లెవెల్ లో ఉన్న ఈ సాంగ్ టేకింగ్ చూసి సోషల్ మీడియా షేక్ అయ్యేదని అంటున్నారు. ఆ రేంజ్ లో యష్, కియారా రొమాన్స్ పండిందట. అధికారికంగా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ సోర్స్ అయితే అదే అంటోంది. మొత్తం నాలుగు పాటలు ఉన్న టాక్సిక్ నుంచి తక్కువ గ్యాప్ లోనే అన్ని రాబోతున్నాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే సినిమా నిండా హీరోయిన్లు ఉన్నా వాళ్ళను ఎక్కువ బయట  పెట్టకుండా మేనేజ్ చేస్తున్నారు.

రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి తదితరులను కేవలం పోస్టర్ల ద్వారా మాత్రమే పరిచయం చేశారు. టీజర్ లో కూడా కనిపించలేదు. సెన్సార్ కోసం రెడీ అవుతున్న టాక్సిక్ పనుల్లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్, హీరో యష్ ఇద్దరూ బిజీగా ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో కలిపి భారీ రిలీజ్ కు కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. మంచి డిస్ట్రిబ్యూటర్లు దొరకడంతో దురంధర్ ది రివెంజ్ కు పోటీ ఇవ్వడం ఖాయమే. పాజిటివ్ టాక్ వస్తే కెజిఎఫ్ రికార్డులే టార్గెట్ అవుతాయి.

Related Post

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన సంగతి తెలిసిందే. సిట్ నివేదికలోని అంశాలపై టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. అయితే, సిట్ నివేదికలో విస్తుపోయే

Female Filmmakers in Focus: Rebecca Miller on “Mr. Scorsese”Female Filmmakers in Focus: Rebecca Miller on “Mr. Scorsese”

The work of filmmaker and historian Martin Scorsese needs no introduction. The director behind countless iconic and award-winning films like “Taxi Driver,” “The Departed,” and “The Wolf of Wall Street,”