hyderabadupdates.com movies టాక్సిక్ నెంబర్లు నమ్మొచ్చంటారా

టాక్సిక్ నెంబర్లు నమ్మొచ్చంటారా

మార్చి 19 విడుదల కాబోతున్న యష్ టాక్సిక్ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. అదే రోజు దురంధర్ 2 ది రివెంజ్ వస్తున్నా సరే వెనక్కు తగ్గకుండా పోటీకి సిద్ధ పడిన వైనం గురించి ట్రేడ్ వర్గాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. వన్ అఫ్ ది బిగ్గెస్ట్ క్లాష్ గా దీని గురించి చెప్పుకుంటున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను 120 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని అధికారికంగా ఎస్విసి ధృవీకరించలేదు. కానీ సమాచారమైతే చక్కర్లు కొడుతోంది. ఎంత అడ్వాన్ బేసిస్ మీదే అయినా ఎంతో కొంత రిస్క్ పొంచి ఉన్న మాట వాస్తవం.

టాక్సిక్ మీద కెవిఎన్ సంస్థ భారీ బడ్జెట్ పెట్టింది. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉంది. చాలా వాయిదాలే పడ్డాయి. కెజిఎఫ్ తర్వాత మూవీ కావడంతో యష్ ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు కమర్షియల్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో యష్ చాలా పెద్ద రిస్కు తీసుకున్నాడు.

టీజర్ మంచి కాంట్రవర్సినే తీసుకొచ్చిన నేపథ్యంలో అందరి చూపులు ట్రైలర్ మీద ఉన్నాయి. ఒకవేళ అది కనక అంచనాలకు తగ్గట్టు ఉంటే మతిపోయే నెంబర్లతో బిజినెస్ జరగడం ఖాయం. మళ్ళీ అసలు టాపిక్ కు వద్దాం.

ఏపీ తెలంగాణ మీద నూటా ఇరవై కోట్ల రికవరి రావడం అంత ఈజీ కాదు. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాలి. అసలే దురంధర్ 2 రివెంజ్ తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఈసారి థియేటర్ కౌంట్ పెద్దఎత్తున ఉండబోతోంది. దానికి ధీటుగా ఉండాలంటే టాక్సిక్ అంతకు మించి అనిపించే రెస్పాన్స్ తెచ్చుకోవాలి.

దిల్ రాజు నెట్ వర్క్ లో స్క్రీన్ల పరంగా ఇబ్బందులు ఉండవు కాబట్టి మిగిలింది అంచనాలు అందుకోవడమే. ఇంకో రిస్క్ లేకపోలేదు. సరిగ్గా వారం రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. అది పాజిటివ్ గా ఉంటే టాక్సిక్ మీద ప్రభావం చూపించే అవకాశాన్ని కొట్టి పారేయలేం.

Related Post

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయితెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రా బిడ్డ చూసుకుందాం…రెడీ అంటూ కేసీఆర్ ను

కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగి.. క‌విత గెలవగలరా?కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగి.. క‌విత గెలవగలరా?

సెంటిమెంటుకు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య స‌యామీ క‌వ‌ల‌ల‌కు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాద‌ని నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రా?  సాధ్యంకాదు. సో.. అలాంటి సెంటిమెంటు అస్త్ర‌మే కేసీఆర్‌. ఆయ‌న ఇప్పుడు యాక్టివ్‌గా లేక‌పోవ‌చ్చు. కానీ, కేసీఆర్ అంటే ఒక సెంటి మెంటు. ఒక