hyderabadupdates.com Gallery ‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్

‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్

‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్ post thumbnail image

బెంగ‌ళూరు : పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ కీ రోల్ పోషిస్తున్న చిత్రం టాక్సిక్. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కేజీఎఫ్ -2 త‌ర్వాత య‌శ్ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో త‌న ఫ్యాన్స్ తో పాటు మూవీ వ‌ర్గాలు సైతం ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఇందులో మ‌రో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది ల‌వ్లీ బ్యూటీ రుక్మిణి వ‌సంత్. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం టాక్సిక్ మూవీ మేక‌ర్స్ కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమాకు సంబంధించి రుక్మిణి వ‌సంత్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది. సామాజిక వేదిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ చిత్రాన్ని పంచుకున్నారు. త‌న లుక్స్ మ‌రింత కాటు వేసేలా ఉన్నాయి. త‌ను ముదురు ఆకుప‌చ్చ రంగు హైస్లిట్ గౌనులో క‌నువిందు చేసింది. ఈ సంద‌ర్బంగా అద్భుత‌మైన ఈ ఫోటోకు క్యాప్ష‌న్ కూడా జ‌త చేసింది.
పెద్దల కోసం ఒక విషపూరిత అద్భుత కథ అయిన టాక్సిక్ లో మెల్లిసా పాత్రలో రుక్మిణి వసంత్‌ను పరిచయం చేస్తున్నామని , ఇక వేచి చూడ‌డ‌ట‌మే మిగిలి ఉంద‌ని పేర్కొన్నారు నిర్మాత‌లు. ఈ సినిమాకు పేరు కూడా టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన‌ప్స్ అని ట్యాగ్ చేర్చారు. ఇక సినిమా ప‌రంగా చూస్తే ఇప్ప‌టికే ద‌ర్శ‌కురాలు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఏడాది మార్చి 19వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తామ‌ని. ఇదిలా ఉండ‌గా త‌ను గ‌తంలో తీసిన మూత‌న్ , ల‌య‌ర్స్ డైస్ చిత్రాల‌ను తీసింది. ఈ రెండూ అద్భుతంగా ఆడాయి. త‌ర్వాత త‌ను తీస్తున్న చిత్రం టాక్సిక్. ఇక ఈ మూవీని విఎన్ ప్రొడక్షన్స్ , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించాయి. ఇందులో రుక్మిణి వ‌సంత్ తో పాటు కియారా అద్వానీ, న‌య‌న తార‌, తారా సుతారియా ఇత‌ర పాత్ర‌లలో న‌టిస్తుండ‌డం విశేషం.

The post ‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Srinivas Reddy: పత్తి రైతులను ఆదుకుంటాం – మంత్రి పొంగులేటిMinister Srinivas Reddy: పత్తి రైతులను ఆదుకుంటాం – మంత్రి పొంగులేటి

    ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం గోల్‌తండలో 2025 వానాకాలం సీజన్‌కు సంబంధించి సీసీఐ తొలి కేంద్రాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు.

హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లో ప్ర‌జా అవ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూములు క‌బ్జాకు గురౌతున్నాయ‌ని వాటిని హైడ్రా కాపాడాల‌ని నివాసితులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ప్ర‌గ‌తిన‌గ‌ర్ స్మ‌శాన‌వాటిక స్థ‌లం 5 ఎక‌రాల‌వ‌ర‌కూ ఉండ‌గా.. క‌బ్జాల‌కు గురౌతోంద‌ని స్థానికంగా నివాసం ఉంటున్న

చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసిచరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి

హైద‌రాబాద్ : భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌. రూ. 1000 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు ఇందులో కీల‌క పాత్ర పోషించిన హాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆ