hyderabadupdates.com Gallery ‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్

‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్

‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్ post thumbnail image

బెంగ‌ళూరు : పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ కీ రోల్ పోషిస్తున్న చిత్రం టాక్సిక్. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కేజీఎఫ్ -2 త‌ర్వాత య‌శ్ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో త‌న ఫ్యాన్స్ తో పాటు మూవీ వ‌ర్గాలు సైతం ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఇందులో మ‌రో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది ల‌వ్లీ బ్యూటీ రుక్మిణి వ‌సంత్. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం టాక్సిక్ మూవీ మేక‌ర్స్ కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమాకు సంబంధించి రుక్మిణి వ‌సంత్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది. సామాజిక వేదిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ చిత్రాన్ని పంచుకున్నారు. త‌న లుక్స్ మ‌రింత కాటు వేసేలా ఉన్నాయి. త‌ను ముదురు ఆకుప‌చ్చ రంగు హైస్లిట్ గౌనులో క‌నువిందు చేసింది. ఈ సంద‌ర్బంగా అద్భుత‌మైన ఈ ఫోటోకు క్యాప్ష‌న్ కూడా జ‌త చేసింది.
పెద్దల కోసం ఒక విషపూరిత అద్భుత కథ అయిన టాక్సిక్ లో మెల్లిసా పాత్రలో రుక్మిణి వసంత్‌ను పరిచయం చేస్తున్నామని , ఇక వేచి చూడ‌డ‌ట‌మే మిగిలి ఉంద‌ని పేర్కొన్నారు నిర్మాత‌లు. ఈ సినిమాకు పేరు కూడా టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన‌ప్స్ అని ట్యాగ్ చేర్చారు. ఇక సినిమా ప‌రంగా చూస్తే ఇప్ప‌టికే ద‌ర్శ‌కురాలు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఏడాది మార్చి 19వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తామ‌ని. ఇదిలా ఉండ‌గా త‌ను గ‌తంలో తీసిన మూత‌న్ , ల‌య‌ర్స్ డైస్ చిత్రాల‌ను తీసింది. ఈ రెండూ అద్భుతంగా ఆడాయి. త‌ర్వాత త‌ను తీస్తున్న చిత్రం టాక్సిక్. ఇక ఈ మూవీని విఎన్ ప్రొడక్షన్స్ , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించాయి. ఇందులో రుక్మిణి వ‌సంత్ తో పాటు కియారా అద్వానీ, న‌య‌న తార‌, తారా సుతారియా ఇత‌ర పాత్ర‌లలో న‌టిస్తుండ‌డం విశేషం.

The post ‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్

తిరుమ‌ల : శ్రీ‌వారి ఆల‌యంలో ఈనెల 25న ర‌థ స‌ప్త‌మి నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు గాను శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవ‌లు,

పేద‌ల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లుపేద‌ల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు

అమరావతి : రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని, లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప

త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దుత్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ బాస్ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, సంతోష్ రావుల అరెస్ట్ త‌ప్ప‌ద‌ని అన్నారు.