hyderabadupdates.com movies టాలీవుడ్ పరిస్థితి… మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె

టాలీవుడ్ పరిస్థితి… మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె

ఈ ఇండస్ట్రీకి ఏమైంది అన్నట్టు ఉంది ఇండస్ట్రీ పరిస్థితి. వరుస డిజాస్టర్లు… ఖాళీగా బోసిపోతున్న థియేటర్లు. సంక్రాంతి తరువాత ఒక్క హిట్ సినిమా కూడా లేదు.

ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈరోజు ఏదో పని మీద ఒక డిస్ట్రిబ్యూటర్ కు కాల్ చేస్తే… కాసేపటికి ఏదో ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఎగ్జిబిటర్ ను కాన్ఫరెన్స్ లోకి తీసుకున్నాం.

మాటల మధ్యలో ఆయన వచ్చే వారం విడుదల కానున్న సినిమాల గురించి చర్చ వచ్చింది. ఏప్రిల్ 17 న ఏం సినిమాలు ఉన్నాయి అంటే సదరు ఎక్జిబిటర్ చెప్పిన మాట ఇండస్ట్రీ పరిస్థితికి అర్ధం పడుతుంది.

ఒక సినిమా రిలీజ్ అవుతుందని పేరు కరెక్ట్ గా చెప్పారు. ఇంకో హీరో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు గానీ సినిమా పేరు చెప్పలేకపోయారు. ఆఖరికి ఒక ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు గానీ ఏప్రిల్ 17నే వచ్చే ఇంకో తెలుగు సినిమా ఉందనే విషయం కూడా మర్చిపోయారు.

వారం రోజుల్లో రిలీజ్ అనగా ఆయా సినిమాల పరిస్థితి ఇది. తప్పు ఎక్కడ జరుగుతుంది? కొన్ని సినిమాలు అనౌన్స్ చెయ్యగానే ఫెయిల్యూర్స్. అప్పుడూ ఆడియన్స్ ను ఎక్సైట్ చెయ్యవు.. రిలీజ్ అయ్యే నాటికి ఎవరూ పట్టించుకోరు. మరి ఆ సినిమాలు ఎందుకు తీస్తున్నట్టో తీసేవారికే తెలియాలి.

కొన్ని సినిమాలు పూర్తిగా మార్కెటింగ్ ఫెయిల్యూర్. తాము ఇరగదీసి ప్రమోషన్స్ చేస్తున్నాం అనుకుంటారు గానీ చెయ్యరు. ఎంత ప్రమోషన్ చేసినా కొన్ని సినిమాలు అంతే అందుకోవు. కొన్ని సినిమాలు ఆడియన్స్ ను రంజింపజేయవు.. ఒకవేళ చేసినా కంటెంట్ సరిపోవడం లేదు. మూడు రోజులకే దుకాణం సర్ధేస్తున్నాయి.

OTT, IPL ఇవన్నీ తరువాతి ముచ్చట్లు… నిజం చెప్పాలంటే మనం ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తియ్యడం లేదు. ఇండస్ట్రీ ఆ విషయంలో నిజాన్ని అంగీకరించలేని స్థితిలో ఉంది. అలా ఉన్నంతకాలం ఇంతే. ఎనిమిది వారాలకు OTT, పర్సంటేజ్ సిస్టమ్ అవన్నీ తరువాత ముందు ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే సినిమాలు తియ్యాలి.

ఇకపోతే ఈ మధ్య ఇంకో ట్రెండ్ మొదలయ్యింది. అదే ఫేక్ కలెక్షన్స్, ఫేక్ సక్సెస్ మీట్స్. ఒకప్పుడు ఇవి పెద్ద సినిమాలకు మాత్రమే జరిగేవి. అయితే పెద్ద సినిమాల్లో ట్రాకింగ్ కాస్త బెటర్ అవ్వడంతో నెగటివ్ పబ్లిసిటీకి భయపడి కాస్త తగ్గించారు. ఎవరన్నా అటువంటివి చేస్తే వెంటనే దొరికిపోయి ఇంకా నెగటివ్ అవుతున్నారు. ఆ భయంతో కాస్త తగ్గించారు. కలిపినా ఒక 20% అంతే.

అయితే ఈ ఫేక్ కలెక్షన్స్, ఫేక్ సక్సెస్ మీట్స్ ట్రెండ్ మీడియం రేంజ్ సినిమాల్లో ఈ మధ్య ఎక్కువైంది. 50% నుండి 60-70% ఫేక్ చేసేస్తున్నారు. వీటిని పట్టించుకుని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిబేట్ చెయ్యరు కాబట్టి వాళ్ళ ఇష్టం. ఎంత వేసుకుంటే అంత.

“ఫేక్ కలెక్షన్స్ వేసి మా సినిమా ఇరగదీస్తోంది అంటే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారని భ్రమ పొందుతున్నారేమో ఆడియన్స్ మనకంటే తెలివైనవారు. ఒక్క టిక్కెట్ కూడా తెగదు వీటివల్ల,” ఒక డిస్ట్రిబ్యూటర్ మాతో అన్న మాట.

ఎందుకు చేస్తున్నట్టు మరి అంటే ఎవరిదగ్గర సమాధానం లేదు. ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళతో పని చేసే ప్రతీ యంగ్ హీరోకు ఎంత వచ్చింది అనే దానితో సంబంధం లేకుండా 100 కోట్ల పోస్టర్ వేసేస్తుంది. తమ సినిమాల కలెక్షన్స్ బయటకు ఇవ్వకుండా బయర్స్ ను కట్టడి చేస్తుంది. తమతో పని చేసే యంగ్ హీరోల రేంజ్ పెంచి వాళ్ళతో ఒక బంధం ఏర్పరచుకునే పద్దతి అట ఇది. అలా చేస్తే ఇంకా సినిమాలు తెస్తారు తమ బ్యానర్ కు అని.

ఈ మధ్య రిలీజ్ అయిన కొన్ని చిన్న/మీడియం సినిమాలకు కూడా కలెక్షన్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పెద్ద బ్యానర్ కాకపోయినా డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆ పట్టు చూస్తుంటే ముచ్చటేస్తుంది. డబ్బులు పోయిన వాళ్ళు కూడా మేము హ్యాపీ అని బయటకు వచ్చి చెప్పుకోవాల్సి రావడం ఈ ట్రాజెడీ కథలో బిగ్ ట్విస్ట్.

ఒకపక్క థియేటర్స్ ఖాళీగా ఉంటే హీరోలు నా బెస్ట్ సినిమా ఇదే అంటూ ఊదరగొడుతున్నారు. సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. నిజంగానే అంతటి భ్రమల్లో ఉంటున్నారా? లేకపోతే పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలా? మొదటిది అయితే ఇండస్ట్రీని దేవుడే కాపాడాలి.

ఏదన్నా సినిమా పోతే ఆ ప్రొడ్యూసర్ సక్సెస్ మీట్ పెడతారు… పోస్ట్-రిలీజ్ ప్రమోషన్స్ చెయ్యకుండా వదలకూడదు కాబట్టి చెయ్యాలి సరే… పోనీ సింపుల్ గా ఏ ప్రసాద్ ల్యాబ్ లోనో పెట్టుకోవచ్చుగా తక్కువలో… లేదు బడాయి కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ లో పెట్టాలి. ప్రొడ్యూసర్ ను మరింత ఇబ్బంది పెట్టాలి.

థియేటర్స్ ఖాళీగా ఉంటే పోని పరువు, ఆడని సినిమాకు సక్సెస్ మీట్ పెడితే పోనీ పరువు… సింపుల్ గా చేసుకుంటే పోతుందా? అసలు ప్రెస్ మీట్ కు వచ్చే మీడియా కు తప్ప మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారో ఎవరికైనా తెలుసా?

ఈ విషయంలో మైత్రిని, రామ్ ను మెచ్చుకోవాలి. ఆ మధ్య వచ్చిన ఆంధ్రకింగ్ తాలూకా సక్సెస్ మీట్ ప్రసాద్ ల్యాబ్ లో పెట్టారు. ఇలా కదా ఉండాల్సింది!

అసలు ఎందుకు ఈ తిప్పలు. ఈ ఎఫర్ట్ అంతా… ఈ ఎనర్జీ అంతా బెటర్ అవుట్ ఫుట్ ఇవ్వడంలో పెట్టొచ్చు కదా?

Related Post

Anaganaga Oka Raju Review:  Naveen Polishetty Kills It Yet Again With His Fun GagsAnaganaga Oka Raju Review:  Naveen Polishetty Kills It Yet Again With His Fun Gags

Anaganaga Oka Raju is a 2026 Telugu-language romantic comedy and village drama written and directed by Maari. The film has Naveen Polishetty & Meenakshi Chaudhary playing the lead roles, while

‘బాహుబలి’ రాకెట్: దేశానికి లాభమేమీటంటే..‘బాహుబలి’ రాకెట్: దేశానికి లాభమేమీటంటే..

రీసెంట్‌గా ఇస్రో లాంచ్ చేసిన LVM3-M5 ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం మన దేశానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే, 4,410 కిలోల బరువున్న CMS-03 శాటిలైట్‌ను ఇండియా నుంచి పంపడం అనేది మామూలు విషయం కాదు. ఈ ప్రయోగం సక్సెస్