hyderabadupdates.com Gallery టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణ

టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణ

టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణ post thumbnail image

తిరుప‌తి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టిటిడి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. ప్రస్తుతం టిటిడిలోని 56 ఆలయాలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరునాటికి అన్ని ఆలయాలలో రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో టిటిడి ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్‌లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాలలో టిటిడి ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. సంబంధిత రాష్ట్రాల అధికారులతో టిటిడి అధికారులు చర్చించి, కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకు రావాలని సూచించారు.
అదేవిధంగా చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్‌లు, పరిపాలనా అనుమతుల అంశాలను టిటిడి బోర్డు ఆమోదానికి తీసుకు రావాలని ఆదేశించారు. రుషికేష్‌లోని పీఏసీ కూలిపోయే స్థితిలో ఉందని పేర్కొంటూ, టిటిడి ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టి వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
The post టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దుఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దు

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది ప్ర‌యాణీకుల‌కు. ప్ర‌స్తుతం ఇరాన్ ప్ర‌భుత్వం త‌మ గ‌గ‌న త‌లాన్ని మూసి వేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో అమెరికాతో పాటు ఇత‌ర దేశాల‌కు ప్ర‌యాణం చేసే, ముంద‌స్తు బుకింగ్ చేసుకున్న ట్రావెల‌ర్స్

స్పూర్తి దాయకం డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జీవితంస్పూర్తి దాయకం డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జీవితం

హైద‌రాబాద్ : మ‌హోన్న‌త మాన‌వుడు, భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జ‌యంతి ఇవాళ‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న జీవితంలో చేసిన కీల‌క‌మైన వ్యాఖ్య‌లు ఇక్క‌డ మీ కోసం అందిస్తున్నాం. 1. చరిత్రను మరచిపోయిన వారు చరిత్రను

మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలిమళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని, పసుపు జెండా మోసిన వారిని పార్టీ అధిష్టానం ఎప్పుడూ ప్రాధాన్యమిస్తూనే ఉంటుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వ‌మే రాష్ట్రంలో